దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల సూత్రధారిగా
అనుమానిస్తున్న వకాస్ అరెస్టు
ఎన్నికల వేళ కుట్రను చేధించిన ఢిల్లీ, రాజస్థాన్ పోలీసులు
జైపూర్, మార్చి 23 (జనంసాక్షి) :
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న వకాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో వకాస్ వారికి చిక్కాడు. అతడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని హత్య చేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏడాది క్రితం జంట బాంబు పేలుళ్లు పదుల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.