విషాదంగా ముగిసిన మలేషియా విమాన ఉదంతం


హిందూ మహాసముద్రంలో జలసమాధి
కౌలాలంపూర్‌, మార్చి 24 (జనంసాక్షి) :
రెండు వారాల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం ఉదంతం విషాదంగా ముగిసింది. మలేషియన్‌ ఎరు ర్‌లైన్స్‌ కు చెందిన విమానం హిందూ మహాసముద్రంలో కూలి పోయినట్లు మలేషియా ప్రధానమంత్రి నజీబ్‌ రజాక్‌ ప్రక టించారు. గాల్లోకి ఎగిరిన కొన్ని గంటల్లోనే విమానం కూలి పోయినట్లు ఆయన సోమవారం అధికారంగా వెల్లడించారు. హిందూ మహాసముద్రానికి నైరుతి దిశగా 2,500 కిలోమీటర్ల దూరంలో విమానం శిథిలాలు లభ్యమవడంతో విమానం కూలిపోయినట్లుగా నిర్దారిస్తున్నామన్నారు. మృతు ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళ వారం వెల్లడిస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల బ్రిటన్‌ విమానం అందజేసిన ఛాయాచిత్రాల ఆధారం గా చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా విమాన శిథిలాలను కనుగొ న్నట్టు ప్రకటించారు. 16 రోజుల క్రితం కౌలాలంపూర్‌ నుం చి 239 మందితో బయల్దేరిన విమానం దక్షిణ చైనా సము ద్రం మీదుగా మలుపు తిరిగిందని రాడార్‌ సిగ్నళ్ల ద్వారా తేలింది. అదృశ్యం అవడానికి ముందు సముద్ర మట్టానికి కేవలం 12 వేల అడుగుల ఎత్తున మాత్రమే అది ప్రయాణిం చిందని, మలుపు తీసుకోవడానికి
రెండు నిమిషాలు పట్టవచ్చని, అదే సమయంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. లేదా పైలెట్‌, కో పైలెట్‌ ప్రమాద సంకేతాలు పంపి ఉండొచ్చని అంటున్నారు. మలుపు తిరిగే క్రమంలోనే విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పీ3 ఓరియన్‌ విమానంలోని సిబ్బంది దక్షిణ హిందూ మహాసముద్రంలో రెండు వస్తువులను గుర్తించారని ఆ దేశ ప్రధాని టోనో అబాట్‌ సోమవారం ప్రకటించారు. ఇందులో ఒకటి వృత్తాకారంలో బూడిద రంగు ఆకుపచ్చ రంగులో ఉండగా మరొకటి దీర్ఘ చతురస్రాకారంలో నారింజ రంగులో ఉంది. ఆస్ట్రేలియా నౌకాదళానికి చెందిన సరుకు రవాణా నౌక హెచ్‌ఎంఏఎస్‌ సోమవారం రాత్రి సముద్రంలో కనపడిన వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మంగళవారం ఉదయానికల్లా ఆ నౌక వస్తువులు కనిపించిన ప్రదేశానికి చేరుకునే అవకాశముందని మలేషియా రక్షణ మంత్రి హిషాముద్దీన్‌ హుస్సేన్‌ తెలిపారు. ఉపగ్రాహాలు విడుదల చేసిన ఛాయా చిత్రాల ఆధారంగా విమాన శకలాలు కనిపించినట్టుగా చెబుతున్న ప్రాంతంలో 1,150 మీటర్ల నుంచి ఏడు వేల మీటర్ల వరకు ఉండొచ్చని ఫసిపిక్‌ కమాండ్‌ పేర్కొంది. విమానం కూలిన ప్రదేశాన్ని కనుగొన్న తర్వాత బ్లాక్‌ బాక్స్‌ను గుర్తించే పరికరాలను పంపుతామని ఫసిపిక్‌ కమాండ్‌ పేర్కొంది. సముద్రంలో 20 వేల అడుగుల లోతున ఉన్నా బ్లాక్‌ బాక్స్‌ను గుర్తించే సామర్థ్యం ఆ పరికరాలకు ఉంటుందని కమాండ్‌ తెలిపింది.