గత మేనిఫెస్టో హామీలు నెరవేర్చాం
మాది చేతల ప్రభుత్వం
మీ వాణి.. మా హామీ
ఆరోగ్యం ప్రాథమిక హక్కు
పేదల జెండాయే కాంగ్రెస్ ఎజెండా
గుజరాత్ కంటే మాదే అభివృద్ధి : మన్మోహన్
మళ్లీ అధికారంలోకి వస్తాం : సోనియా
మోడీ సిద్ధాంతంతో దేశం అల్లకల్లోలం : రాహుల్
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ, మార్చి 26 (జనంసాక్షి) :
గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, తమది చేతల ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికలకు ప్రజా కర్షకంగా పలు హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టో విడు దల చేసింది. ‘మీ వాణి.. మా హామీ’ నినాదంతో కాం గ్రెస్ ఈ మేనిఫెస్టో రూపొందించింది. పేద, బడుగు బలహీనవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల మేని ఫెస్టో రూపిందించారు. ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ దీనిని రూపొందించింది. నవభారత ఆకాంక్షల ను కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హావిూ ఇచ్చారు. అలాగే దేశంలో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హావిూ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చామని చెబుతూనే ఇప్పుడు కొత్త హామీలను అమలు చేస్తామన్నారు. దేశంలో అందరికీ అందుబాటులో వైద్య సదుపాయాలు తీసుకుని రావ డంలో కృషి చేస్తామన్నారు. ధరల నియంత్రణ, మహి ళా సాధికారత సాధిస్తామని హావిూ ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు కృషిచేస్తామన్నారు. సాంఘిక భద్రత హక్కు సాధిస్తామన్నారు. 8 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఎన్నికలకు సంబంధించిన కేసులన్నీ త్వరితంగా పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు. పింఛను హక్కు తీసుకుని వస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రాజకీయ కార్యక్రమాలకు నిధుల ఖర్చు విషయంలో పారదర్శకత పాటిస్తామన్నారు. అవినీతి నిరోధక బిల్లుల ఆమోదానికి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కృషి చేస్తామన్నారు. గుజరాత్ కంటే మాది భిన్నమైన అభివృద్ధి నమూనా అని ప్రధాని ప్రకటించారు. దార్శనికతతో సవిూకృత అభివృద్ధి సాధ్యమని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ కంటే తమది భిన్నమైన అభివృద్ధి నమూనా అన్నారు. అన్నివర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా కృషిచేస్తామన్నారు. ఎన్‌డీఏ పాలనకంటే యూపీఏ హయాంలోనే వృద్ధిరేటు పెరిగిందని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఇది కళ్లముందు కనిపిస్తోందన్నారు. ఏది చెప్పామో అదే చేశామన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రణాళిక తయారీకి చాలా కసరత్తు చేశామని, 2014 ఎన్నికల ప్రణాళిక తయారీకి కొత్త పద్ధతి అవలంబించామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివరించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పలువర్గాల వారితో సంప్రదింపులు జరిపారని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఈసారి మరింత వేగవంతంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని సోనియా గాంధీ చెప్పారు. పేదలు, వెనకబడిన వర్గాలకు అండగా ఉంటామన్నారు. ఉత్పాదక రంగంతో కలిసి ఆర్థికాభివృద్ధి సాధిస్తామని హావిూ ఇచ్చారు. లౌకిక భారతం కోసం పోరాడతామన్నారు. వారణాసి నుంచి పోటీకి అభ్యర్థిని ఇంకా ఎంపిక చేయలేదని సోనియా చెప్పారు. 2009 ఎన్నికల ప్రణాళికలోని హావిూల్లో 90 శాతం అమలుచేశామని ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. దేశ అభివృద్ధికి పరిశ్రమలు, పేదల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమలో తామే కలహించుకునేలా మోడీ విధానాలున్నాయని రాహుల్ విమర్శించారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ అంతిమంగా ప్రజలు యూపీఏకే మళ్లీ పట్టం కడతారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమికి అనుకూల వాతావరణం ఉందని, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బుడగ పూర్తిగా పేలడం ఖాయమని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుస్తామంటున్న బీజేపీ కలలు నెరవేరవని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. 2004 ఎన్నికల్లో భారత్ వెలిగిపోతుంది అనే నినాదంతో బీజేపీ పోటీకి దిగినపుడు ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం చేసినా ఫలితాలు మాత్రం తమకే అనుకూలంగా వచ్చాయని గుర్తుచేశారు. దేశంలోని ప్రజలందరికీ వైద్య హక్కు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ప్రజలందరికీ ఆరోగ్యమే యూపీఏ-3 నినాదమని పేర్కొన్నారు. ఇప్పటికే పేదప్రజల ఆకలి తీర్చేందుకు ఆహార భద్రతబిల్లు తెచ్చాం. ఉపాధికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చాం. యూపీఏ-3 అధికారంలోకి వస్తే ప్రజలందరికీ వైద్య హక్కు అందుబాటులోకి తీసుకువస్తాం అని పేర్కొన్నారు. మహిళలు సాధికారత సాధిస్తేనే దేశం పటిష్ఠంగా మారుతుందన్నారు. మహిళలకు సాధికారత కల్పించేందుకు పంచాయతీరాజ్ వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచామన్నారు. ఇప్పుడు అదే దృక్పథంతో ముందుకు పోతున్నామని విజయం కాంగ్రెస్‌దేనన్నారు.
గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. 2009 ప్రణాళికలోని హామీల్లో 90 అమలు చేశామని గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని, కాంగ్రెస్ విధానం గుజరాత్ విధానాలకు భిన్నమని ఆయన చెప్పారు. ఎన్‌డీఏ పాలన కంటే యూపీఏ పాలనలోనే వృద్ధి రేటు పెరిగిందని తెలిపారు. దేశంలోని పేదలే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అత్యవసరమని, ఎన్నికల ప్రణాళిక తయారీకి చాలా కసరత్తు చేశామన్నారు. 2014 ఎన్నికల ప్రణాళిక తయారీకి కొత్త పద్ధతి అవలంబించామని చెప్పుకొ చ్చారు. మేనిఫెస్టోలో అందరి అవసరాలను చేర్చాం. పేదలు, వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉంటాం. పేదవారి కోసం అనేక పథకాల్ని ప్రవేశపెడుతున్నాం. యవత కోసం ప్రత్యేక స్కీంలు తీసుకు వచ్చాం. ఎక్ తా కోసం కాంగ్రెస్ పని చేస్తుందని వివరించారు. రైతులు, వివాహిత మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నాం. రైతుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని పునరుద్ఘా టించారు. . మరింత వేగవంతంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తామని,. ఉత్పాదక రంగంతో కలిసి ఆర్థికాబి óవృద్ధిని సాధిస్తాం. లౌకిక భారతం కోసం పోరాడుతామని సోనియా ప్రసంగంలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల కార్యక్రమానికి సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్ సహా అగ్ర నేతలు హాజరయ్యారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం దేశవ్యా ప్తంగా వివిధ వర్గాలతో చర్చించిన తర్వాతే మేనిఫెస్టోను రూపొందించినట్లు రాహుల్‌గాంధీ తెలిపారు. దేశ అభివృద్ధికి పరిశ్రమలు, పేదల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. నవభారత ఆకాంక్షలను కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పేర్కొన్నారు.