ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు ఆపండి

మే 7 తర్వాతే వెల్లండించాలి

ఏప్రిల్‌ 11న రెండో విడత పోలింగ్‌

సుప్రీం కీలక తీర్పు

న్యూఢిల్లీ, మార్చి 27 (జనంసాక్షి) :

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు ఆపాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముగిసిన అనంతరం మే 7 తర్వాత ఫలితాలు వెల్లడించాలంటూ సూచించారు. సుప్రీంకోర్టు జోక్యంతో రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూలులో స్వల్పంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్రిల్‌ 6, 8కి బదులుగా 6, 11 తేదీల్లో ఎన్నికల నిర్వహణకు సుప్రీం అంగీకరించింది. శ్రీరామనవమి సందర్భంగా 8న ఎన్నికలు నిర్వహించరాదని వచ్చిన అభ్యంతరాలను పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రెండు విడతల్లో అంటే ఎప్రిల్‌ 6,11 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. అలాగే ఫలితాలను 13న ప్రకటిస్తామని తెలిపింది. దీనికి సుప్రీం అనుమతిస్తూనే సాధారణ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకనే మే7 తరవాత ఫలితాలు ప్రకటించాని సూచిందచింది. దీంతో మండల, జడ్పీ ఫలితాలు మాత్రం మే7 తరవాతనే ప్రకటిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సుప్రీంకోర్టు గురువారం ఈ విధంగా కీలక తీర్పును వెల్లడించింది. సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలని న్యాయస్థానం పేర్కొంది. దాంతో మే 7వ తేదీ తర్వాతే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రీషెడ్యూల్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఓట్ల లెక్కింపు తేదీని కూడా తామే నిర్ణయించనున్నట్లు కోర్టు పేర్కొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలను ఏప్రిల్‌ 8న (శ్రీరామనవమి) కాకుండా 11వ తేదీన నిర్వహించడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దాంతో మొదటి విడత 6వ తేదీన, రెండో విడత పోలింగ్‌ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 6, 11 తేదీల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిపేందుకు సిద్దమని రాష్ట్ర ఎన్నికల సంఘంగ కూడా సుప్రీంకు వివరించింది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీపై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఏప్రిల్‌ 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఏప్రిల్‌ 13న ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేయగా, ఫలితాల వెల్లడికి పిటిషనర్‌ అభ్యంతరం తెలిపారు. 13న ఫలితాలు విడుదల చేస్తే ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందని పిటిషనర్‌ వాదించారు. పిటిషనర్‌ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. మే 7 తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాధారణ ఎన్నికల తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలని న్యాయస్థానం పేర్కొంది. దాంతో మే 7వ తేదీ తర్వాతే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. మే 7న రెండోవిడత ఎన్నికలు పూర్తవుతాయి.