నేడు తెలంగాణలో సార్వత్రిక నోటిఫికేషన్‌ : భన్వర్‌లాల్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి)
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. 17 ఎంపీ,119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరు గనున్నాయి. నామినేషన్‌ దాఖలు సమయంలో మూ డు వాహనాలకు మా త్రమే అనుమతి ఉంటుందని, అభ్యర్థితో పాటు ఐదుగురికి మాత్రమే కార్యాల యం లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. రేపటినుంచి ఈ నెల 9 వరకు నామినేష న్లు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 7 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతుందని భన్వర్‌లాల్‌ తెలిపా రు. 42 పార్లమెంటు స్థానా లకు 42 మంది పరిశీల కులను నియమించామని, 294 అసెంబ్లీ నియోజ కవర్గాలకు 84 మంది పరిశీలకులను నియమిం చామని ఆయన తెలిపారు. దీంతో తెలం గాణలో ఎన్నికల నగారా మోగింది. ఈమేరకు రేపు తెలం గాణ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు. తెలంగాణలో
రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 10న నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్‌ 12న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్‌ 30న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ పక్రియ మొదలు కానుంది.