రెండు రాష్ట్రాల్లో అధికారం మాదే
ప్రజాగర్జనలో బాబు ధీమా
వరంగల్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్ని కల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం తమదేనంటూ టీడీపీ అధ్య క్షుడు చంద్రబాబునాయుడు అతివిశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం హన్మ కొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన ప్రజాగర్జనలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలు దొరలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని, బహుజన రాజ్యాన్ని స్థాపిస్తానని తెలిపారు. జిల్లా మహిళలు రుద్రమదేవిలాగా పోరా డాలని, చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయమని అన్నారు. దేవాదులను తామే ప్రారంభించామని చెప్పుకున్న చంద్రబాబు దానిని ఎందుకు పూర్తి చే యాలో మాత్రం చెప్పలేదు. తాను సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలోనే సైబరా బాద్‌ను నిర్మించానని, తన పాలనలోనే హైదరాబాద్‌కు రింగ్‌రోడ్డు, అంతర్జా తీయ విమానాశ్రయం వచ్చాయని గొప్పలు చెప్పుకున్నారు. తన ఊరిని అబి óవృద్ధి చేసుకోలేదని, హైదరాబాద్‌నే అభివృద్ధి చేశానని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణను దోచుకుంటాడని
అన్నారు. ఇక్కడ తెలుగు దేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వా తే పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒక్క పనైనా చేసిందా అంటూ ప్రశ్నించారు. ఆర్థికంగా, రాజకీయంగా తెలంగాణను పైకి తీసుకువస్తామంటూ ఇక్కడి ప్రజలకు ఏమీ తెలియదన్నట్టుగా మాట్లాడారు. టీడీపీయే బీసీలకు పదవులిచ్చిందని, తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు తమకే ఉందంటూ బీరాలు పలికారు. గడి పాలన కావాలో సుపరిపాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలనం ద్వారా తెలంగాణ తమ ప్రభావం ఎంతమాత్రం లేదనే విషయాన్ని పరోక్షంగా బాబు ఒప్పుకున్నారు. టీఆర్‌ఎస్ కేవలం ఉప ఎన్నికల పార్టీ అని, కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని, ఎస్సీని సీఎం చేస్తానని మాట మార్చారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ వసూళ్ల పార్టీ అని విమర్శించారు. చేనేత కార్మికులను ఆదుకుంటామని, బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.