పొత్తు పొడవలేదు
పొద్దు దగ్గర పడుతోంది
పార్టీల్లో ఆందోళన
తలుపులు పడ్డాయో? తెరుచుకుంటాయో? తెలియని వైనం
అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
హైదరాబాద్, ఏప్రిల్ 3 (జనంసాక్షి) :
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి రెండు రో జులు గడిచినా రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కొలిక్కిరా లే దు. గతంలో ఎన్నడూ లేనంత అయోమయ రాజకీయా లతో అన్ని పార్టీల నేతలు తమ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. నా మినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసేందుకు ఇంకా ఐదు రోజులే సమయముండటం, పొత్తులు ఎటూ తేలకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణలోని పది జిల్లా ల్లో గల 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలకు ఈనెల 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం మంగళవారమే నోట ిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 9 వరకు ఆశావహుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే పొత్తులు, అవగాహనపై ఎలాంటి ఒప్పందాలు కాకపో వడంతో అన్ని పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు తాము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామా? లేదా? అనే డైలమాలో ఉన్నారు. టీఆర్‌ఎస్ ఒంటిరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ముఖ్యనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గురు వారం స్పష్టమైన ప్రకటనా చేసినా ఆ పార్టీకి కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన దాదాపు ఖరారైనట్టు ము ఖ్య నేతలకు సమాచామందింది. కొందరు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉం టుందని, వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తారని కేసీఆర్‌కు సన్నిహితంగా మెలిగే నేతలే చెప్తున్నారు. ఇది వరకు ఏ ఎన్నికల సమ యంలోనైనా పొత్తుపై ఆసక్తి చూపే పార్టీలు నోటిఫికేషన్‌కు ముందే సీట్ల సర్దు బాటు అంశాన్ని పరిష్కరించుకునేవి. కానీ ఈ సారి నోటిఫికేషన్ జారీ అయి రెండు రోజులు గడిచినా పొత్తుల లెక్కలు తేల లేదు. బీజేపీతో తమ పార్టీ పొ త్తు ఖరారయిందని టీడీపీ నేతలు చెప్తున్నా, తెలంగాణ బీజేపీ నేతలు అలాంటి దేమి లేదని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు అత్యధిక సీట్లు ఇస్తేనే పొ త్తు పెట్టుకుంటామని, లేదంటే ఒంటరి పోరుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీట్ల లెక్క
తేల్చకుంటే ఒంటరిపోరుకు సిద్ధమని ఆయనకు అత్యంత సన్నిహితుడైన భాజపా అగ్రనేత వెంకయ్యనాయుడు హెచ్చరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకానొక దశలో చంద్రబాబును మోడీ వద్దకు తీసుకెళ్లిన వెంకయ్య పొత్తు ఇక కుదరదనడంతో చంద్రబాబు బెట్టువీడి కాళ్ల బేరానికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ వ్యతిరేకించడం ద్వారా ఈ ప్రాంతంలో పూర్తిగా పట్టుకోల్పోయిన టీడీపీ సీమాంధ్రలో కప్పదాట్ల ద్వారా కాస్త బలంగా ఉన్నట్టు కనిపించినా అది బలుపో.. వాపో ఎన్నికల తర్వాతకాని తెలియదు. తెలంగాణ బీజేపీ నాయకులను విస్మరించి నేరుగా అధినాయకత్వంతోనే టీడీపీ శ్రేణులు చర్చలకు దిగడం ఇక్కడి నేతలకు మింగుడు పడలేదు. దీంతో వారు టీడీపీకి బదులుగా టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రతిపాదన తీసుకువచ్చారు. ఉద్యమ పార్టీతో కలిసి వెళ్తే ఎన్నికల్లో ఎంతో బలం పెరుగుతందని కిషన్‌రెడ్డి అధినాయకత్వంలో ముఖ్య నేతల వద్ద ప్రతిపాదించారు. ఈమేరకు తాను కేసీఆర్‌తో చర్చలు జరిపి సీట్ల పంపకాన్ని కొలిక్కి తీసుకువస్తానని చెప్పారు. అయితే కిషన్‌రెడ్డి ప్రతిపాదనను తిరస్కరించిన బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీతోనే కలిసి సాగేందుకు సిద్ధమని ఆయనకు నచ్చజెప్పింది. ఈమేరకు సీట్ల సర్దుబాటుకు సహకరించాలని కోరింది. దీంతో కిషన్‌రెడ్డి సహా మిగతా నేతలు రాష్ట్రంలో టీడీపీ బలం గణనీయంగా పడిపోయింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేదని, పైపెచ్చు చాలా చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయని, అలాంటి పార్టీతో పొత్తే వద్దని బెట్టు చేశారు. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం తమతో పొత్తు పెట్టుకోవాలంటే 40కి పైగా శాసనసభ, 8 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాల్సిందేనని టీడీపీ అధినేతకు అల్టిమేటం జారీ చేసింది. ఒకనొక దశలో అకాళీదల్ ఎంపీ అనిల్ గుజ్రాల్ మధ్య వర్తిత్వంతో చర్చలు జరిపినా అవి ఫలవంతం కాలేదు. గురువారం అర్ధరాత్రి వరకు కూడా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుల లెక్కతేలలేదు. మరో వైపు కాంగ్రెస్‌తో సీట్ల అవగాహన చేసుకుంటామన్న సీపీఐ పలు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను పట్టుబడుతుండటంతో పొత్తు లెక్కల్లో ప్రతిష్టంబన నెలకొంది. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లు హుస్నాబాద్, పినపాక, మహబూబాబాద్ తదితర స్థానాలపై పట్టుబడుతోంది. తెలంగాణలో ఒక పార్లమెంట్, ఎనిమిది శాసనసభ స్థానాలను సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సమ్మతించింది. అయితే హుస్నాబాద్ స్థానంపై ఇంకా ప్రతిష్టంబన కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, టీడీపీ పొత్తుల చర్చలు గురువారం ఎలాంటి పురోగతి సాధించలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15 శాసనసభ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలను బీజేపీ కోరుతోంది. తాము ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుస్తాం కాబట్టి అవి తమకే ఇవ్వాలని కమలనాథులు కోరుతున్నారు. మరో వైపు టీడీపీ నేతలు చంద్రబాబుతో భేటీ అయి తమ స్థానాలను బీజేపీకి కేటాయిస్తే తీవ్రంగా నష్టపోతామని విన్నవించారు. అయితే ముగిసిందనుకున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య పొత్తు మళ్లీ మొదటికొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. ఈమేరకు శుక్రవారం సాయంత్రానికల్లా ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారు కానుందని తెలిసింది. దీంతో ఏయే స్థానాలు ఎవరెవరికి కేటాయిస్తారో? తమ స్థానాలు ఉంటాయో? పొత్తులో పోతాయో? తెలియక అన్ని పార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ముందే పొత్తులు ఖరారైతే పక్క పార్టీలోకి, స్వతంత్రంగానో బరిలో నిలిచే అవకాశముండేదని, నామినేషన్లు వేసే చివరి క్షణాల్లో పొత్తులు కుదిరితే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు పొత్తులకు తలుపులు పడ్డాయో? మళ్లీ తెరుచుకుని అవగాహన కుదురుతుందో తెలియక అన్ని పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా పొత్తు వ్యవహారం తేలెట్టుగా లేకపోవడంతో పార్టీ అభ్యర్థిగా ఒక సెట్, ఇండిపెండెంట్లుగా మారో సెట్ నామినేషన్లు వేసేందుకు వారు సిద్ధపడుతున్నారు. ఒకవేళ శుక్రవారం కూడా పొత్తుల వ్యవహారం తేలకుంటే ఎన్నికల ఓట్ల బదలాయింపు దాదాపుగా కష్టమేనని, ఒక పార్టీకి సీటు కేటాయిస్తే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇండిపెండెంట్‌గా బరిలో ఉండటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల దాఖలుకు పొద్దు గడుస్తున్నా పార్టీలు ఇంకా పొత్తులు ఖరారు చేయక, బీ ఫారాలు ఇవ్వక తమను మనోవ్యధకు గురి చేస్తోందని తెలంగాణ ప్రాంత నేతలంటున్నారు.