మోడీతో దేశ సమగ్రతకు ముప్పు


కర్ణాటకలో భరితెగించి అవినీతికి పాల్పడ్డారు

ఎన్నికల ప్రచార సభలో భాజపాను

కడిగి పారేసిన సోనియా

మైసూర్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) :

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో దేశ సమ గ్రతకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్‌ పార్టీ అది óనేత్రి సోనియాగాంధీ హెచ్చరించారు. ప్రస్తుత లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిం చడం దేశ సమైక్యతకు ఎంతో అవసరమని సోని యా పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ మాత్రమే దేశా న్ని ఐక్యంగా ఉంచగలదన్నారు. నేరుగా బీజేపీ పేరు ప్రస్తావించకుండా ఆమె కాషాయదళాన్ని కడి గి పారనేశారు. వారు దేశాన్ని భ్రష్టుపట్టిస్తారని అ న్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తాము దేశ సమైక్యత కోరుకుంటుంటే, వారు(భాజపా) ఏకరూపతను కోరుతున్నారని, భారతదేశం అంతా ఒక్కటిగా ఉం డాలని తాము ఆలోచిస్తుంటే వారు దేశాన్ని ము క్కలు చేయాలని చూస్తున్నారు అని సోనియా ఆరో పించారు. వారికి ఈ దేశం మీద, దీని ఔన్నత్యం మీద గౌరవం లేదన్నారు. యూపీఏ హయాంలో వివిధ రంగాల్లో విజయాలు సాధించామని ఈ సం దర్భంగా తెలిపారు. ప్రస్తుత ఎన్నికలు భారత జాతికి ఎంతో ముఖ్యమైనవి, ఎందుకంటే భారత దేశం ఎలా ఉండాలని

ప్రజలు కోరుకుంటున్నారో అలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కొందరు మాత్రం కేవలం అధికా రంలోకి రావడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. మీరు అనుకునే భారతదేశాన్ని వారు తీర్చిదిద్దలేరని భాజపాను ఉద్దేశించి విమర్శలు చేశారు. మతతత్వ పార్టీ అనే మచ్చను భాజపా కప్పిపుచ్చుకునేందుకు చూస్తోందని ఆరోపించారు. అధికారంలోకి రావడమే ఆ పార్టీకి ఉన్న ఏకైక లక్ష్యమని, భవిష్యత్తు గురించి కాషాయదళానికి సరైన అవగాహన లేదని ఆమె మండిపడ్డారు. తమ హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించామని, భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు విచారణ జరిపించలేదని ఈ సందర్భంగా సోనియా ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 12న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథిలో పర్యటించనున్నారు. రాహుల్‌ సొంత నియోజకవర్గమైన అమేథీలో తల్లితో కలిసి ప్రచారంలో పాల్గొంటారని రాహుల్‌ కార్యదర్శి చంద్రకాంత్‌ దుబే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్‌ వేయకముందే వారు నియోజక వర్గంలో పర్యటించనున్నారు.