మోడీ, నేనూ పరస్పర శ్రేయోభిలాషులం : రజనీకాంత్
చెన్నై, ఏప్రిల్ 13 (జనంసాక్షి) :గుజరాత్ ముఖ్యమంత్రి తా ను పరస్పర శ్రేయోభిలాషులమని తమిళ సూపర్‌స్టార్ రజనీకాం త్ అన్నారు. ఆదివారం తమిళనాడు పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ చెన్నైలోని రజనీ నివాసానికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. అర్ధగంట సేపు ఇద్దరూ చర్చించుకున్నారు. అనంతరం రజనీ కాంత్ మాట్లాడుతూ, చెన్నైకి వచ్చిన
మోడీని అల్పాహార విందుకు ఆహ్వానించానని చెప్పారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తనను ఆయన పరామర్శించారని తెలిపారు. మోడీ బలమైన నాయకుడ ని, ఆయన మంచి జరగాలని కోరుకుంటున్నట్లు రజనీ అన్నారు. తమ భేటీకి రాజకీయ కారణాలు లేవని, స్నేహ పూర్వకంగానే కలుసుకున్నామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల సమమంలో రజనీకాంత్‌తో మోడీ భేటీ అవడం బీజేపీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన తమ భేటీకి రాజకీయ కారణాలు లేవని చెప్పిన మోడీని రజనీ కలుసుకోవడం ద్వారా తమిళనాడులోనే కాక దక్షిణ భారతదేశంలో తమ పార్టీకి బలం పెరుగుతుందని బీజేపీ శ్రేణులు తెలుపుతున్నాయి.