ఆరో విడత పోలింగ్ ప్రశాంతం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 (జనంసాక్షి) :
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాం తంలోని 117 లోక్‌సభ స్థానాలకు గురువారం ఆరోదశ పోలింగ్ ప్రశాంతంగా మగిసింది. చెదురు మదురు సంఘటనలు తప్ప ఎక్కడా ఎలాంటి హిం స చోటు చేసుకోలేదు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలవద్ద బారులు తీరారు. మునుపటికన్నా ఈ సారి భారీ పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు తెలి పాయి. ఈ ఎన్నికల్లో 2076మంది అభ్యర్థులు బరిలో నిలవగా 18కోట్ల మంది ఓటర్లు వారి తల రాతను నిర్దేశించనున్నారు. తమిళనాడులో 39 స్థానాలకు, పుదుచ్చేరిలోని ఒక స్థానానికి, అసోం లో 6, బీహార్ 7, ఛత్తీస్‌గఢ్ 7, జమ్మూకాశ్మీర్ 1, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 10, మహారాష్ట్ర 19, రాజ స్థాన్ 5, ఉత్తరప్రదేశ్ 12, పశ్చిమబెంగాల్ 6 స్థా నాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో పలు కీల కస్థానాల్లో వీఐపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తమిళనాడులో డీఎంకే తరఫున మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ (మధ్య చెన్నై), ఎ.రాజా (నీలగిరి), టీఆర్ బాలు (శివగంగ) అదే నియోజ కవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున కేంద్ర ఆర్థిక మం త్రి చిదంబరం తనయుడు కార్తీ పోటీ చేస్తున్నారు. ముంబైలో కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రి మిలిం ద్ దేవర (దక్షిణ), ప్రియాదత్ (నార్త్ సెంట్రల్), ఆప్ తరఫున మేధాపాట్కర్ (దక్షిణ) లోక్‌సభ స్థానా ల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ (మెయిన్‌పురి), ఆయన కోడలు డింపుల్‌యాదవ్ (కన్నౌజ్), ఆరెల్డీ చీఫ్ అజి త్‌సింగ్ కుమారుడు జయంత్‌సింగ్ (మథుర), అదే స్థానంనుంచి బీజేపీ తరఫున బాలీవుడ్ సినీస్టార్ హేమామాలిని బరిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ (విదిశ) పోటీ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో తమిళనాడులో నిర్వహించిన లోక్‌స భ ఎన్నికల పోలింగ్‌లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూ పర్ స్టార్ రజనీకాంత్, ముఖ్యమంత్రి జయలలిత ప్రముఖ సినీనటుడు కార్తీక్‌లు స్టెల్లామేరీస్ కళా శాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ
అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ, ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అయితే తాను ఏ పార్టీకీ మద్దతివ్వలేదని స్పష్టం చేశారు. ఓటర్లలో చైతన్యం కల్గించడానికి ఎన్నికల సంఘం ప్రచారకర్తగా నియమించిన ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్, సినీనటి గౌతమితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినీ హీరో విజయ్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ కోలివుడ్ స్టార్ విజయ్‌కాంత్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ సినీనటుడు శివకుమార్, సినీ హీరోలైన తన ఇద్దరు కుమారులు సూర్య, కార్తిలతో కలిసి ఓటు వేశారు. నటుడు శరత్‌కుమార్, సినీనటి కుష్బూ ఆమె భర్త సుందర్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అస్సాంలోని కోక్రాఝర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిని అదుపుచేసే ప్రయత్నంలో ఓ పోలీసు అధికారి మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో బీఎస్‌ఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపారు. హింస చోటుచేసుకోవడంతో 5 బూత్‌లలో పోలింగ్ నిలిపివేశారు. మరోవైపు దేశ ప్రజలందరూ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విజ్ఞప్తి చేశారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో సచిన్ ఓటు ప్రాధాన్యాన్ని తెలుపుతూ కామెంట్ పోస్ట్ చేశారు. ఓటుకున్న శక్తిని తక్కువ అంచనా వేయవద్దని, క్రికెట్లో ప్రతి పరుగు లెక్కలోకి వచ్చినట్లే అభ్యర్థి గెలుపోటముల్లో ప్రతి ఓటు లెక్కలోనికి వస్తుందని సచిన్ పేర్కొన్నారు. ఈ మాటలు చెప్పడమే కాదు, సచిన్ చేసి చూపించారు. గురువారం జరిగిన ఆరో విడత పోలింగ్‌లో సచిన్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుంటే బీహార్‌లోని వైశాలీ జిల్లా పరిధిలోగల అంజనీచౌక్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 92 లక్షల రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ముఖేశ్ కుమార్, అభిషేక్ కుమార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు వైశాలీ ఎస్పీ ప్రసాద్ చౌదరి తెలిపారు. పట్టుబడిన నగదులో వేర్వేరు దేశాలకు చెందిన కరెన్సీలు యూఎస్ డాలర్, దినార్, రియాల్ తదితరాలున్నట్టు ఆయన తెలిపారు.