ఇంత చిన్నచూపా


రాహుల్‌ దళితుల ఇళ్లకు వెళ్లేది హనీమూన్‌, పిక్నిక్‌లకే
: బాబా రాందేవ్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) :
యోగా గురువు బాబా రాందేవ్‌ తన బుద్ధిని చాటుకు న్నాడు. దళితుల మనోభావాలను దెబ్బతీసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌గాంధీ దళి తుల ఇళ్లకు వెళ్లేది హనీమూన్‌, పిక్నిక్‌లకేనంటూ వారి ని దిగజార్చేలా మాట్లాడారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి శుక్రవారం లక్నోలో తన మద్దతు తెలి పిన సందర్భంగా రాందేవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబా రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలతో పాటు కాంగ్రెస్‌ నేతలు, బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబా రాం దేవ్‌ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్య దర్శి దిగ్విజయ్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన దళిత వ్యతిరేకి అని పేర్కొన్నారు. అలాగే దళిత సంఘాల నేతలు జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాందేవ్‌ బాబా వ్యాఖ్యలపై
పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా రాందేవ్‌ వ్యాఖ్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బాబా రాందేవ్‌ శనివారం వివరణ ఇచ్చారు. హనీమూన్‌ అనే పదాన్ని సరదాకే వాడానని, దళిత స్త్రీలను ఉద్దేశించి తాను అలా అనలేదని తెలిపారు. తన వ్యాఖ్యలు దళితుల మనసును గాయపరిస్తే క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించారు.