తెలంగాణ తెచ్చింది మేమే : సుష్మ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (జనంసాక్షి) :
తెలంగాణ ఇచ్చినట్లు చెప్పుకొనే నైతిక హక్కు కాం గ్రెస్‌కు లేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిం ది తామేనని బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. 1100 మంది ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్‌కు ఓట్లడిగే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ సహకారం లేకుంటే తెలంగాణ ఏర్పడేది కాదని గుర్తు చేశారు. రెండు
రాష్ట్రాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సుష్మ శనివారం తెలంగాణలో పర్యటించారు. మెదక్, వరంగల్, నల్లగొండ, హైదరాబాద్‌లలో నిర్వహించిన ఎన్నికల సభల్లో పర్యటించారు. తెలంగాణ ఇచ్చినట్లు చెప్పుకొనే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. తమ పార్టీ ఒత్తిడి వల్లే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. సొంత సీఎం కిరణ్‌ను ఒప్పించలేకపోయిన కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటుకు చేసిందేవిూ లేదని తెలిపారు. 1100 మంది యువకుల బలిదానాలకు ఆ పార్టీయే కారణమని ధ్వజమెత్తారు. విభజనపై తొమ్మిదేళ్లకు పైగా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసి, ఎన్నికల సమయంలో హడావుడి నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. ఆర్నెళ్ల ముందే రాష్ట్రాన్ని విభజించి ఉంటే ఇంత గందరగోళం ఏర్పడేది కాదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్ల దేశానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పదేళ్ల పాలనలో అనేక కుంభకోణాలు వెలుగు చూశాయని విమర్శించారు. తమ హయాంలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. దేశమంతా యూపీఏ సర్కారుపై విసుగెత్తి ఉన్నారని రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని తెలిపారు. తెలంగాణకు బీజేపీ తొలి నుంచి మద్దతుగా నిలబడిందని సుష్మా తెలిపారు. ఒక ఓటు, రెండు రాష్టాల్రు అని కాకినాడ తీర్మానాన్ని గుర్తుచేశారు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ ఏర్పడిందని, తాము ఒత్తిడి తేకుంటే కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేదే కాదన్నారు. ఉభయ సభల్లో బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ బిల్లు పాసయ్యేది కాదన్న సుష్మ.. తమ వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందన్నారు. కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తమకు అధికారం అప్పగించాలని సుష్మ కోరారు. తెలంగాణను ధాన్యాగారంగా మారుస్తామని హావిూ ఇచ్చారు. అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై సుష్మ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ భాష బాధ్యతారాహిత్యంగా ఉందని మండిపడ్డారు. కేసీఆర్‌ది అవకాశవాదం.. అందుకే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీ అనడం సరికాదని హితవు పలికారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత బీజేపీదేనని.. అందుకే ఇక్కడికి వచ్చానని ఆ పార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. తెలంగాన ఏర్పాటులో బిజెపిదే కీలక పాత్ర అని ఆమె అన్నారు. హన్మకొండలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సుష్మా ప్రసంగించారు. రాణి రుద్రమదేవి జన్మించిన ఓరుగల్లుకు ప్రణమిల్లుతున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంతోషకరం. తెలంగాణ ఏర్పాటు కోసం బీజేపీ తొలి నుంచీ అంకితభావంతో పని చేసిందన్నారు. అద్వానీ, రాజ్‌నాథ్, మోడీ అంతా తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశాం. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ కపట నాటకాలాడింది. తమ ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ముందుకు వచ్చిందన్నారు. గతంలో 3 రాష్టాల్రను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాటు చేశాం. తెలంగాణ ఏర్పాటులో జాప్యంపై కాంగ్రెస్‌ను ప్రశ్నించింది మేమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అనేక అడ్డంకులను సష్టించిందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేస్తాం. సీమాంధ్రకు న్యాయం చేస్తామని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ సకాలంలో తెలంగాణ ఇచ్చి వుంటే ఇంతమంది బలిదానాలు జరిగేవి కావన్నారు. ప్రజలు తెలుగుదేశం – భాజపా కూటమికి మద్దతుగా నిలవాలని సుష్మాస్వరాజ్ అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన కూడా ఇరుప్రాంతాలు సోదర భావంతో కలిసి వుండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఓటు అడిగే హక్కు లేదని సుష్మాస్వరాజ్ అన్నారు. శనివారం జిల్లాలోని బీజేపీ అభ్యర్థుల తరపున సుష్మా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక రైతాంగానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని హావిూ ఇచ్చారు. కేసీఆర్‌ది అవకాశవాద రాజకీయమని, ఆయన పోటీ చేస్తున్న రెండు చోట్ల ఓటమి తప్పదని సుష్మా వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఒత్తిడి వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చినట్లు చెప్పుకునే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని సుష్మా స్వరాజ్ అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని తెలిపారు. తెలంగాణలో యువకుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని సుష్మా స్వరాజ్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి కె చంద్రశేఖర్ రావు భాష బాధ్యతారాహిత్యంగా ఉందని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్న విమర్శలు సరికాదన్నారు.