తెలంగాణలో ముగిసిన ప్రచారం


పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఎగ్జిట్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై నిషేధం
ఆళ్లగడ్డలో శోభ గెలిస్తే ఉప ఎన్నిక
నిబంధనలు అతిక్రమిస్తే
కఠిన చర్యలు : భన్వర్‌లాల్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) :
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం పూర్తవగా, మిగ తా ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం పరిసమా ప్తం అయింది. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావే శంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తోన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మృతి చెందడంతో ఈ సెగ్మెంట్‌లో ఎన్నికల నిర్వహణపై సందిగ్దతకు ఆయన తెరదించా రు. ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీకి లేఖపై స్పష్టత వచ్చింది. ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి గెలిస్తే మళ్లీ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీంతో పోలింగ్‌ యథాతథమని తేలిపోయింది. గత బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. సాయంత్రం తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగుసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై నిషే ధం విధించారు. ఎన్నికలు జరిగే వరకు ఒపీనియన్‌ పోల్స్‌, ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం ఉంటుందని అన్నారు. తెలంగాణలో పోలింగ్‌ రోజు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు సెలవు ప్రక టించామని సెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరైనా ఈసీ ఆదేశాలకు భిన్నంగా కార్యాల యాలు నడిపితే జైలుశిక్ష కూడా పడుతుందని హెచ్చరించారు. 30వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా మీడియాలో అభ్యర్థుల ఇంటర్వ్యూలు కూడా నిషేధిస్తున్నట్లు తెలిపారు. 17వేలకు పైగా కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నా రు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పోలింగ్‌ కేంద్రాల్లో దా దాపు 3, 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటుం దని తెలిపారు. ఈ నెల 30 న పోలింగ్‌ జరగనున్న తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం ఆరుగంటలకు ప్రచారఘట్టం పరిసమాప్తమ య్యింది. భద్రాచలంతో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. మరో ఏడు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు, మిగిలిన నియోజ కవర్గాలన్నింటిలోనూ సాయంత్రం 6
గంటలకు ప్రచార ఘట్టం ముగిసింది. గడువు దాటిన తర్వాత ఎలాంటి ప్రచారం చేయరాదని ఎన్నికల సంఘం పేర్కొంది. తొలిదశ ఎన్నికలు జరిగే తెలంగాణలో ¬రుగా ప్రచారం ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ జిల్లాల్లో దాదాపుగా అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారాలను నిర్వహించిన నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా తెలంగాణప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చామని చెప్పారు. ఇరు రాష్టాల్రె అభివృద్ధికి కాంగ్రెస్‌ని గెలిపించాలన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ ఒంటరి పోరుతో దూసుకుని పోయింది. తెలంగాణలోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు బుధవారం ఎన్నిక జరగనుండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భన్వర్‌లాల్‌ తెలిపారు. భారీ స్థాయిలో పోలీసు బలగాలు మొహరించామన్నారు. లోక్‌సభ నియోజకవర్గాలకు 265 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే, అసెంబ్లీ నియోజక వర్గాలకు 1,669 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. తెలంగాణ మొత్తంమీద హైదరాబాద్‌లోని అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 32 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో 85 నుంచి 90 శాతం వరకు ఓటరు చీటీల పంపిణీ పూర్తయిందని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి నాయకులు సోమవారం సాయంత్రంలోగా ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని భన్వర్‌లాల్‌ చెప్పారు. ఓటర్లు కాని నేతలు ఏ నియోజక వర్గంలో ఉన్నా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ భద్రత కల్పించిన ప్రజాప్రతినిధులపై నిఘా పెడతామని వెల్లడించారు. పోలింగుకు 48 గంటల ముందుకు నుంచి ఓటర్లను ప్రభావితం చేసే పనులు చేయకూడదన్నారు. సామూహిక సంక్షిప్త సందేశాలు కూడా ఓటర్లకు పంపించకూడదని స్పష్టం చేశారు. మద్యం దుకాణాలు సైతం సోమవారం సాయంత్రం నుంచి మూసి వేయాలన్నారు. తొలిదశ ఎన్నికలు జరిగే నియోజక వర్గాలకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలు కూడా మూసివేయాల్సిందేనన్నారు. ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు రూ.125.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని భన్వర్‌లాల్‌ తెలిపారు. 74.2 కిలోల బంగారు, 708 కిలో వెండి వస్తువులు ఉన్నాయి. 4.57 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎన్నికల గడువు సమీపించటంతో డబ్బుల ప్రభావం పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భన్వర్‌లాల్‌ సూచించారు. జిదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. పోలింగ్‌ కోసం 20 వేల మంది భద్రతాసిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. ఈరోజు సాయంత్రం 6గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని, ఇంటింటి ప్రచారం, గంపగుత్త సందేశాలు(బల్క్‌ ఎస్‌ఎంఎస్‌), పాదయాత్రలపై నిషేధం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, వస్తువుల పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థి వాహనంతో పాటు మూడు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని, ఒక్కో వాహనంలో డ్రైవర్‌తోపాటు ఐదుగురికి మించి ఉండరాదని కమిషనర్‌ తెలిపారు. నగరంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈమేరకు ఇవాళ నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎన్నికలకు ఎలాంటి ఆటంకం జరుగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సీపీ పేర్కొన్నారు. 20 వేల మంది పోలీసుల్ని భద్రత కోసం నియమిస్తున్నామని తెలిపారు. 37 కంపెనీల కేంద్ర బలగాలను కూడా వినియోగించుకుంటామని వివరించారు. బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు నిలిపివేయాలని ఆదేశించారు. ఈసీ రూల్స్‌ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.