తొలి తెలంగాణ సర్కారు మాదే : ఈటెల
హైదరాబాద్, మే 3 (జనంసాక్షి) :తెలంగాణలో తొలి సర్కారు మాదేనని, నూటికి నూరు శాతం తమ పార్టీయే అధికారం చేపడుతుందని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంటుందని చెప్పారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని తామే ఏర్పా టు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస అన్ని సమస్యల పరిష్కారా నికి విధాన రూపకల్పన చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలో తమ పార్టీ ఎమ్మె ల్యేలు నిర్ణయిస్తారని ఈటెల తెలిపారు. తమ పార్టీ అధినేతను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని విషప్రచారం చేసిందని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజలు త్వరత గతిన అభివృద్ధి కోరుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దేశానికి లౌకిక ప్రభుత్వం కావాలి. అందుకు మా భాగస్వామ్యం ఉంటుంది. మూడో కూ టమి వస్తే తప్పకుండా మా నిర్ణయం ప్రకటిస్తామన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యపై స్పందిస్తూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనిపై గవర్నర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. తన అన్నయ్య చిరంజీవిని ప్రశ్నించలేని జన సేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కెసిఆర్‌ను ప్రశ్నిస్తారా అని తెలంగాణ రాష్ట్ర సమితి నేత లు ప్రశ్నించారు. శనివారం తెరాస నాయకులు ఈటెల రాజేందర్, నోముల నర్సింహయ్యలు విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందన్నారు. థర్డ్ ఫ్రంట్‌కే తమ మద్దతు అని చెప్పారు. దేశంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. తెరాస సెక్యులర్ పార్టీ అని, కేంద్రంలో సెక్యులర్ పార్టీకే మద్దతు తెలుపుతామన్నారు. థర్డ్ ఫ్రంట్‌లో సీపీఎం, టీఎంసీలు ఉన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. అన్నను ఎదిరించలేని పవన్.. మోడీని ప్రశ్నించగలరా అని నోముల అన్నారు. కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కెసీఆర్‌ను అవమానించేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య అన్నారు. పవన్ ఎందుకు పార్టీ పెట్టిండో ఎవరి కోసం పెట్టిండో ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతదని అందరూ అనుకుంటున్నారని నోముల తెలిపారు.