వివాదాస్పద జల్లికట్టును నిషేధించిన సుప్రీం
న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) :
తమిళనాడులో సంప్రదాయ వివాదాస్పద క్రీడ జల్లికట్టును నిషే ధిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జ్టసిస్ కేఎస్ రాధాకృష్ణన్, జ్టసిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలోని ధ ర్మాసన బెంచ్ జల్లికట్టులో ఎద్దుల ప్రమేయం జంతుహింస కిం దకు వస్తుందని పేర్కొంది. జంతువుల
పరిరక్షణపై చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. తమిళనాడుతో పాటు చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఈ జల్లికట్టును ప్రతియేటా నిర్వహిస్తారు. దీనివల్ల ఎందరో యువకులు గాయాల పాలవ్వడమే గాకుండా, పలు సందర్భాల్లో కొందరు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక పశువులు కూడా హింసకు గురవుతున్నాయి. ప్రజలు తమ స్వార్థం కోసం పశువులను బలి చేస్తున్నారు. దీంతో సుప్రీం దీనిపై కఠిన నిర్ణయం తీసుకుంది.