ఓటేసిన మొదటి ఓటర్
1951 నుంచి ఓటేయడం మానలేదు
కిన్నౌర్, మే 7 (జనంసాక్షి) :
స్వాతంత్య్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి సార్వత్రిక ఎన్నికల ఎనిమిదో విడతలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. బుధవారం హి మాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని కప్లి పోలింగ్ స్టేషన్‌లో తన భార్యతో కలిసి ఆయన ఓటు హ క్కును వినియోగించుకున్నారు. 97 ఏళ్ల నేగితో పాటు ఆయన అభిమానులు పలువురు తరలివచ్చి ఓటు వేశారు. తనలాంటి వృద్ధుడినే ఓటు వేస్తున్న ప్పుడు యువకులు ఎందుకు ఓట్లు వేయరని ఆ యన ప్రశ్నించారు. యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లో టీచర్‌గా పనిచేసిన నేగి 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల సమ యంలో దేశంలోనే తొలి ఓటరుగా నమోద య్యాడు. అప్పుడు ఆయన వయసు 34 సంవత్స రాలు. ఆరోజుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో చలితీవ్రత ఎక్కువగా ఉండేది. మంచుతో రోడ్లు కప్పుకుపో యేవి. ఇలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలను హిమాచల్‌ప్రదేశ్‌లో 1951 అక్టోబర్‌లోనే నిర్వ హించారు. అలా హిమాచల్‌లోని చీనీ తెహసిల్‌లో మొదటి ఓటు వేసిన నేగి స్వతంత్ర భారతంలో తొలి ఓటరుగా నమోదయ్యాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా తన ఓటు హక్కును విని యో గించుకుంటున్నాడు.