ఇంకా దొరకని విద్యార్థుల ఆచూకీ
అత్యాధునిక పరికరాలు వాడినా కానరాని ఫలితం
సిమ్లా, జూన్ 13 (జనంసాక్షి) :
కన్నీళ్లు రాలుతూనే ఉన్నాయి.. ఆశలు సన్నగిల్లు తున్నాయి.. మృతదేహాల వెలికితీతకు చేస్తున్న విస్తృత ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఓవైపు అత్యాధునిక పరికరాలు.. మరోవైపు మానవ వనరులు..
విస్తృత గాలింపు.. అయినా ఫలితం కానరావడం లేదు. శుక్రవారం ఒక్క మృతదేహాన్ని కూడా వెలికితీయలేదు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. బియాస్ నదిలో ఆదివారం ఫొటోలు దిగుతూ 24 మంది విద్యార్తులు గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటివవరకు కేవలం 8 మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు. గత నాలుగు రోజులుగా ఒకటి, రెండు మృతదేహాలు లభ్యమైనప్పటికీ, శుక్రవారం ఒక్క శవం కూడా బయటపడలేదు. ఐదురోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ పెద్దగా ఫలితం కానరావడం లేదు. అదనపు సిబ్బంది, అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా మృతదేహాల వెలికితీత సవాలుగా మారింది. వరద ఉద్ధృతి, పెద్ద పెద్ద బండరాళ్లు, బురద సహాయ సిబ్బంది ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఆచూకీ లేని 16 మంది కోసం ఎన్డీఆర్‌ఎఫ్ సహా ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ తదితర సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మానవ రహిత విమానంతో బియాస్ నదిని వీడియో, ఫొటోలు తీస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. నీరు మడ్డిగా ఉండడంతో నీటి అడుగున ఉపయోగించే కెమెరాలు కూడా ఎలాంటి చిత్రాలు తీయలేక పోతున్నాయి. ర్యాప్టింగ్ బోట్ల సాయంతోనూ ఐటీబీపీ సిబ్బంది మరోమారు నదీ ప్రాంతాన్ని అణువణువూ గాలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సహాయక సిబ్బందికి తోడు అదనపు సిబ్బంది జత కలిశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు తెలంగాణకు చెందిన గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ రాజీవ్ త్రివేది నేతృత్వంలోని డైవింగ్‌లో అనుభవం ఉన్న పది మంది పోలీసు సిబ్బంది శుక్రవారం గాలింపు చర్యలు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని పండూ డ్యాం వరకు జల్లెడ పడుతున్నారు. ప్రత్యేక పరికరాలతో నీటి అడుగున గాలిస్తున్నారు.
ఆందోళనలో తల్లిదండ్రులు
రోజులు గడుస్తున్నా కొద్దీ తల్లిదండ్రుల్లో ఆందోళన, ఆవేదన పెరిగిపోతోంది. తమ పిల్లలను చివరి చూపు చూసుకొనే అవకాశమైనా దక్కుతుందా? లేదా? అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఐదు రోజులుగా చేస్తున్న గాలింపు పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రాణాలతో కాకపోయినా మృతదేహాలనైనా అప్పగించాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెస్క్యూ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలను దగ్గరుండి చూస్తున్న కన్న వారు.. ఇక తమ వారు లభిస్తారనే దానిపై నమ్మకం కోల్పోతున్నారు.
గాలింపును పర్యవేక్షిస్తున్న ఇరు రాష్ట్రాల ప్రతినిధులు
నేడు రిస్క్ సర్చ్‌కు అధికారుల నిర్ణయం
బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతుండగా తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల ప్రతినిధులు అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షస్తున్నారు. తెలంగాణ ¬ంమంత్రి నాయిని, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, ఎన్డీఆర్‌ఎంఏ వైస్ చైర్మన్ మర్రిశశిధర్‌రెడ్డి దగ్గరుండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు ఉదయం మండి చేరుకున్నారు. గల్లంతైన విద్యార్థుల్లో 8 మృతదేహాలను వెలికితీయగా, 16 మంది మృతదేహాలు లభించాల్సి ఉంది. గాలింపును కోసం మానవ రహిత విమానాలు రంగంలోకి దిగాయి. అలాగే ఏడీజీ రాజవ్ త్రివేదీ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంగ్లిష్ చానెల్ ఈదిన అనుభవం తనకుందని, గాలింపు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటానని ఆయన తెలిపారు.
మొత్తానికి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు అక్కడే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుంటే బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం క్లిష్టమైన ఆపరేషన్‌కు అధికారులు సిద్ధమవుతున్నారు. లాడ్జి డ్యాంకు చెందిన మూడు గేట్లను మూడుగంటల పాటు పూర్తిగా మూసివేసి నీటి మట్టం తగ్గిన వెంటనే రేపు ఉదయం గంటసేపు శరవేగంగా గాలింపు చర్యలు చేపట్టనున్నారు. లాడ్జి దిగువన దాదాపు 18 కిలో విూటర్ల పరిధిలో గాలింపు జరుగనుంది. లాడ్జి డ్యాం గే ట్లు పూర్తిగా మూసివేయడం వల్ల ఎగువన ఉన్న కొన్ని గ్రామాలు కొద్ది సేపు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల కోసం తప్పని సరి పరిస్థితుల్లో అధికారులు ఈ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. డ్యాం గేట్లు మూసివేసిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ మూడు గంటల పాటు లాడ్జి డ్యాం వద్ద విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇదే సమయంలో లాడ్జి డ్యాంకు దిగువన ఉన్న పండో డ్యాం నీటి వీలైనంత తగ్గించేందుకు గేట్లు ఎత్తివేయనున్నారు. ఈ ఆపరేషన్ నిర్వహణపై ఇంజనీర్లు, గాలింపు అధికారులతో మండి కలెక్టర్ సవిూక్ష నిర్వహించారు.
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరో మృతదేహం వెలికితీశారు. బియాస్ నదిలో అలోజీమాతా మందిర్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహం ఎవరిదన్నది గుర్తించనున్నారు. బియాస్ నది దుర్ఘటనలో మరణించిన మరో ఇద్దరు విద్యార్థులు ఉపేంద్ర, అరవింద్ మృతదేహాలు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. నగరంలోని వనస్థలిపురం నివాసి అయిన అరవింద్ మృతదేహాన్ని తీసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి తరలి వచ్చారు. ప్రభుత్వం అతడి మృతదేహన్ని వనస్థలిపురం తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. అలాగే ఉపేంద్ర మృతదేహన్ని అతడి స్వస్థలం ఖమ్మం జిల్లా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు బియాస్ నది నుంచి 8 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత ఆదివారం బియాస్ నదిలో ఫోటో దిగుతున్న సమయంలో లార్జీ డ్యామ్ నుంచి నీరు విడుదల చేయడంతో ఆ నీటి ప్రవాహానికి విద్యార్థులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.