ముమ్మాటికీ డ్యామ్‌ అధికారుల నిర్లక్ష్యమే..

jkl
మన బిడ్డల్ని బలి తీసుకుంది
మానవీయ కోణంలో కేసీఆర్‌ స్పందించారు
మన ఒత్తిడి వల్లే గాలింపు శ్రీసర్కారుకు నివేదిక సమర్పిస్తా
హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్‌, జూన్‌ 17 (జనంసాక్షి) :
హిమాచల్‌ప్రదేశ్‌లోని లార్జీడ్యామ్‌ అధికారుల నిర్లక్ష్యమే మన బిడ్డల్ని బలితీసుకుందని ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే 25 మంది విద్యార్థులు బలయ్యారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చే శారు. వారం రోజులపాటు అక్క డ మకాం వేసి గాలింపు చర్య లను పర్యవేక్షించిన నాయిని హైదరాబాద్‌ చేరు కు న్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిమాచల్‌ ఘటనపై తాము విచారణ జరిపామని పేర్కొన్నారు. లార్జీ డ్యామ్‌ నీటిని వదిలేటపుడు డ్యాం అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరించారని ఎలాంటి హెచ్చరికలు చేయకుండా నే నీటిని వదిలేశారని తెలిపారు. అదే విద్యార్థుల మర ణానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బియాస్‌ నదిలోకి దిగొద్దని స్థానికులు హెచ్చరించినా విద్యార్థులు పట్టించుకోలేదని తెలిపారు. విద్యార్థులు
ఫొటోలు దిగడా నికి నదిలోకి దిగడం, డ్యామ్‌ నీటిని అధికారులు వదిలేయడం ఒక్కసారిగా జరగడంతో దుర్ఘటన సంభవించిందని స్పష్టం చేశారు. క్రమక్రమంగా నీటి ప్రవాహం పెరిగిపోవడంతో విద్యార్థులు నీటిలో చిక్కుకు పోయారన్నారు. ఈ ఘటనపై స్థానిక కలెక్టర్‌, అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. ఘటన జరిగిందని తెలిసిన వెంటనే తాను సీఎం చంద్రశేఖర్‌రావు మానవీయ కోణంలో స్పందించారని ఆయన ఆదేశాల మేరకే అధికారులతో కలిసి హిమాచల్‌కు చేరుకున్నానని నాయిని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనను దృష్టిలో పెట్టుకుని తాము అన్ని విధాలా చర్యలు తీసుకున్నామని అన్నారు. తాము అక్కడ గాలింపు జరుపగా మొదటి రోజు నాలుగు, మరుసటి రోజు మరో నాలుగు మృతదేహాలు దొరికాయని వివరించారు. ఆ తర్వాత సోనార్‌ పద్ధతిలో వెతికినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. మేం అక్కడకు వెళ్లిన వెంటనే కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయం కోరానని రాజ్‌నాథ్‌ అందుకు సానుకూలంగా స్పందించి సహకరించారని వివరించారు. తమ సహాయక చర్యలను చూసి హిమాచల్‌ ప్రజలు ఆశ్చర్య పోయారని పేర్కొన్నారు. గతంలో ఒక ఎమ్మెల్యే కారుతో సహా నీటిలో కొట్టుకుపోయినా, లారీ నీటి ప్రవాహంలో మాయమైన తమ ప్రభుత్వం ఇంతగా స్పందించలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని నాయిని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంతగట్టిదా అన్న విధంగా తాము కేంద్రంతో, రాష్ట్రంతో మాట్లాడి ఒత్తిడి తెచ్చి గాలింపు చేపట్టామన్నారు. తమ ఒత్తడి కారణంగానే కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు రంగంలోకి దిగాయన్నారు. దీంతో కనీసం 750మంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ఘటనపై విచారణ నిర్వహించామని, డ్యాం వద్ద విద్యార్థులు ఫొటోలు దిగుతుండగా ప్రమాదం జరిగిందని నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హెచ్చరికలు లేకుండా డ్యాంనుంచి నీరు విడుదల చేశారని నాయిని తెలిపారు. ఏ మాత్రం చాటింపు వేసినా ఈ ఘటన జరిగేది కాదన్నారు. ఓ తండ్రిగా ఈఘటన తనను కలచి వేసిందన్నారు. కేంద్ర సాయం కోసం ¬ంమంత్రి రాజ్‌నాథ్‌తో పలుమార్లు మాట్లాడామన్నారు. ఘటనపై సీఎం, కలెక్టర్‌, స్థానిక అధికారులతో పలుమార్లు సవిూక్షించామన్నారు. 700 మందితో సహాయ చర్యలు చేపట్టడం వల్ల కొన్ని మృతదేహాలు దొరికాయని మంత్రి తెలిపారు. నీళ్లలో వెదికేందుకు సోనార్‌ పరికరంతో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయిందన్నారు. తల్లిదండ్రుల ఆవేదనను దృష్టిలో పెట్టుకుని మృతదేహాల వెలికితీతకు అన్నివిధాలా కృషిచేశామన్నారు. మిలిటరీ, నేవీ, విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులతో అన్ని రకాల గాలింపు చర్యలు చేపట్టామని నాయిని పేర్కొన్నారు. మరో వారం రోజుల పాటు సహాయ చర్యలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ వద్ద ఉన్న లార్జీ డ్యాం వరద ప్రవాహంలో తెలుగు విద్యార్థులు గల్లంతైన ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు. లార్జీ డ్యాం ప్రవాహంలో గల్లంతైన విద్యార్థుల శవాల కోసం మరో పదిరోజులపాటు గాలింపు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.