తెలంగాణ ఉద్యోగులు తొలి జీతం

హైదరాబాద్ : జులై 1న స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు తొలి జీతం అందుకోనున్నారు. ఇప్పటికే అకౌంట్స్ విభాగం పేస్లిప్స్‌ను సిద్ధం చేసింది. ఇరవై ఏడున్నర రోజుల జీతాన్ని ఉద్యోగులు తీసుకోనున్నారు. ఒకటిన్నర రోజుల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు.