మోడీకి ఒబామా ఆహ్వానం
న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) :
ప్రధాని నరేంద్రమోడీని అగ్రరాజ్యం అమెరికా ఆహ్వానించింది. ఒకప్పుడు వీసా తిరస్కరించిన అమెరికా ఇప్పుడు తనకుతానుగనే ప్రధాని మోడీని అమెరికా పర్యటనకు ఆహ్వానించింది. తమదేశంలో పర్యటించాలని దేశ అధ్యక్షుడు బరాక్ ఒబమా పంపిన వర్తమానంపై భారత ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. అమెరికాలో పర్యటించేందుకు ఆయన అంగీకరించారు. శుక్రవారం ఉదయం అమెరికా విదేశాంగ సహాయమంత్రి విలియమ్ బర్న్స్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి ఒబామా పంపిన లేఖను అందజేశారు. ఒబమా పంపిన లేఖపై స్పందించిన మోడీ ఈ ఏడాది సెస్టెంబర్‌లో అమెరికాలో పర్యటించేందుకు అంగీకరించారు. అమెరికాలో పర్యటించేందుకు ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లేఖ పంపారు. ఈరోజు అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విలియం బర్న్స్ ఆహ్వానప్రతిని ఢిల్లీలో ప్రధాని మోడీకి అందజేశారు. దీనిపై మోడీ సానుకూలంగా స్పందించారు.