892వ రోజుకు చేరిన రిలే దీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): ప్రజల నిర్ణయానికి కట్టుబడి కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రక టించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని ఐకాస నేతలు శ్రీధర్‌, దామోదర్‌ హెచ్చ రించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 892వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రం కుంటిసాకుతో తెలంగాణ అం శాన్ని జాప్యం చేస్తుందని వారు ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మినహా కేంద్రానికి మరో మా ర్గం లేదని వారు పేర్కొన్నారు. కేంద్రం వెంటనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశా రు. రాష్ట్రాన్ని సాధించేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని వారు స్పష్టం చేశారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన