పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి ( జనం సాక్షి)బీ కామ్సన్ హైజెన్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా మంటలను అదుపులోనికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.