ఆపద్బాంధవుడు రాజేందర్ రెడ్డి..సేవా కార్యక్రమాలు చేయడానికి రారు తనకు సాటి ఎవరు

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- గ్రామస్తులకు సేవ చేయడంలో అతని ఎవరు రారు సాటి అతనికి అతనే పోటీ గ్రామంలో ఎవరు ఆపదలో ఉన్న ఆపద్బాంధవుడిగా ఆదుకుంటూ పలు సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఎల్లయ్యగారి రాజేందర్ రెడ్డి.చిలప్ చేడ్ మండలంలోని శీలంపల్లి గ్రామంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ముందుకు సాగుతున్న రాజేందర్ రెడ్డి దానిలో భాగంగానే గురువారం గ్రామ పంచాయతీ లో వైకుంఠరథం కొనుగోలు చేసేందుకు ఒక లక్ష ఆరవై ఐదు వేల రూపాయలు(1,65,000)అందించారు.ఈ కార్యక్రమంలో ముకుందరెడ్డి,భగవంతు రెడ్డి,నవీన్ రెడ్డి,సాయిరెడ్డి,మహిపాల్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,మాధవ రెడ్డి,గోపాల్ రెడ్డి,నవాజ్, శేఖర్,ప్రభు తదితరులు ఉన్నారు..