గవర్నర్‌ చెంతకు బీసీ ఆర్డినెన్స్‌

` ఆమోదం కోసం పంపిన రాష్ట్ర సర్కారు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదా సర్కారు నిర్ణయంతో రాజ్‌భవన్‌కు చేరింది. పంచాయతీరాజ్‌ చట్టం-2018లో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు పంపించింది. పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 285 క్లాజ్‌-ఎ సవరించాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్‌? నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే 285 క్లాజ్‌?-ఎ సెక్షన్‌లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అమలవుతాయని ఉంది. అందులో 50 శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ చట్టాన్ని సవరించాలని నిర్ణయించారు.పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు (సెప్టెంబర్‌ 30) సమీపిస్తున్నందున ఆర్డినెన్స్‌ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పంచాయతీ రాజ్‌ శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత మంత్రి, ముఖ్యమంత్రి ఆమోదంతో ప్రభుత్వం రాజ్‌భవన్‌కు ఆర్డినెన్స్‌ ముసాయిదాగా పంపించింది.ఆర్డినెన్స్‌ గవర్నర్‌ ఆమోదం పొందితే చట్ట సవరణ వెంటనే అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి, స్టేట్‌? ఎలక్షన్‌ కమిషన్‌?కు పంపించనుంది. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే.
2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన ఎజెండా కావాలని, అన్ని రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లు అమలైతేనే నిజమైన విజయం సాధించినట్లవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల మంత్రివర్గ సమావేశం అనంతరం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ బీసీ నేతలు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, ఇతర నాయకులు వేర్వేరుగా సీఎం రేవంత్‌? రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.తాము ఒత్తిడి తీసుకురావడంతోనే కేంద్ర ప్రభుత్వం 2026లో జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని నిర్ణయించిందని, బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని రేవంత్‌? రెడ్డి విమర్శించారు. వాటిని రాజ్యాంగంలో చేర్చి, చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు లక్ష్మణ్‌, ఆర్‌.కృష్ణయ్యలు బీసీ రిజర్వేషన్లపై తమ అగ్ర నాయకులను ఒప్పించి విజయం సాధించాలని పేర్కొన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఇంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశామన్న సీఎం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచొద్దని గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం చేసిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అప్పుడు మంత్రులుగా ఉన్న బీసీలు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లతోనే కేసీఆర్‌ తమపై విమర్శలు చేయించారని ఆక్షేపించారు.అందరు కలిసి కట్టుగా రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలని సూచించారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి దిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయకోవిదులను నియమిస్తామని చెప్పారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టినవారిని, వాళ్లతో పెట్టించినవారిని సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించాలంటూ బీసీలకు పిలుపునిచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు త్వరలోనే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వబోతున్నట్లు వెల్లడిరచారు