ఓటమి భయంతోనే బీఆర్ఎస్ సింపతి రాజకీయాలు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు
చేర్యాల ఫిబ్రవరి 09 (జనంసాక్షి): మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా చేర్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఇంచార్జ్ గా నియమితులైన తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆదివారం మున్సిపాలిటీలో పలు వార్డులలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టు సాయికుమార్ ఇంటింటా తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇంతకుముందు మెట్టు సాయికుమార్ చేర్యాల పట్టణానికి చేరుకోగానే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్లి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డులో ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేర్యాల ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని, గత మున్సిపాలిటీ ఎన్నికలలో అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తూ ముందుకు వెళుతుందని రెండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముస్త్యాల తేజ సంజీవ్ సేవా దృక్పధంతో ప్రజలకు తన వంతుగా ఏదైనా సహాయం చేయాలి అని రాజకీయాల్లోకి వచ్చారు. వారికి ఏ కుట్రా కుతంత్రాలు తెలియని ఆదర్శ ప్రాయులు, ఎదుటివాళ్ళు వారి రాజకీయ మనుగడ కోసం ఓటమి భయంతో, లేనిపోని ఆరోపణలు చేస్తూ సింపతి రాజకీయాల కోసం కుట్రలు పన్నుతున్నారని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాలలోకి వచ్చిన ఇలాంటి వారిని గెలిపించి చేర్యాలను మరింత అభివృద్ధి పరుచుకునే బాధ్యత స్థానిక ఓటరు పై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంజే మల్లేశం, తెలంగాణ యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రాకేష్ కృష్ణన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



