Sunday, 15 November 2026

హైదరాబాద్

సమస్యలు పట్టిపీడిస్తుంటే సీఎం ఆటలాడుతున్నారు: తెదేపా

కడప: రాష్ట్రంలో సమస్యలు పట్టిపీడిస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆటలు ఆడుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోనియాగాంధీ లాటరీ పద్దతిలో ముఖ్యమంత్రులను రాష్ట్రానికి నియమిస్తున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.…

ఎంబీబీఎస్‌ సీట్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌: హైకోర్టు

హైదరాబాద్‌: ప్రేవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లకు సంబందించి దాఖలైన అన్ని పిటీషన్ల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేసినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని…

దేవేగౌడపై లోకాయుక్తలో కేసు నమోదు

బెంగళూరు : దేశ మాజీ ప్రదాని దేవేగౌడపై కర్ణాటక లోకాయుక్తలో కేసు నమోదు అయ్యింది. భూ అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కునడం జరిగింది. ఈ కుంభకోణంలో పలువురు ఐఏఎస్‌లు, న్యాయమూర్తులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి

80పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: లోహ, మూలదనవస్తువులు, వాహన రంగాలకు చెందిన షేర్లకు ఆదరణ లభించడంతో మార్కెట్‌ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 79.71పాయింట్ల లాభంతో 17185.01వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 23.45పాయింట్ల ఆధిక్యంతో 5216.30వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 స్క్రిప్‌లలో 21లాభాలనార్జించాయి. బజాజ్‌ ఆటో,…

కేసీఆర్‌దే తుది నిర్ణయం: వినోద్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉండే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్‌ తెలిపారు. 2008లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తటస్థలంగా ఉన్నామని అదే నిర్ణయాన్ని అమలు చేయవచ్చని అన్నారు.…

ఓఎంసీ, ఎమ్మార్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమ ఆస్తులు, ఓఎంసీ ఎమ్మార్‌ అక్రమాల కేసుల్లో అరెస్టయిన నిందితులకు సీబీఐ కోర్టు ఆగష్టు 1వరకు రిమాండ్‌ పొడిగించింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాదద్‌, బ్రహ్మానందరెడ్డిలను చంచల్‌గూడ జైలు నుంచి…

అన్సారీకి మద్దతు తెలిపిన సీపీఐ

హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీకి తాము మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

సిరియాలో బాంబుపేలుడు, రక్షణశాఖ మంత్రి మృతి

సిరియా:డమాస్కన్‌: సిరియా రాజధాని డమాస్కన్‌లో జరిగిన ఓ బాంబు పేలుడులో రక్షణ మంత్రి జనరల్‌ దావుద్‌ రజా మృతి చెందారు. డమాస్కన్‌లోని రక్షణశాఖ కార్యాలయంలో అయన క్యాబినేట్‌ స్థాయి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా ఈ పేలుడు…

మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ సమావేశం అయింది. సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉప ఎన్నికల పరాజయం, పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి మంత్రులు అభిప్రాయం సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ…

ఎస్సైపై చేయిచేసుకున్న మహిళ

హైదరాబాద్‌: ఓ మహిళ ట్రాఫిక్‌ ఎస్సైపై చేయిచేసుకున్న సంఘటన అమీర్‌పేటలో చోటుచేసుకుంది. నోపార్కింగ్‌ ప్రాంతంలో కారు నిలిపినందుకు దివ్య అనే మహిళకు ట్రాఫిక్‌ ఎస్సై రాజగోపాల్‌ 200రూపాయల చలానా రాశాడు. దీంతో ఆగ్రహించిన దివ్య ఎస్సైపై చేయిచేసుకుంది. విధుల్లో…