గుండెపోటుతో మహిళా వార్డు మెంబర్ అభ్యర్థి మృతి

శంకర్ పల్లి, డిసెంబర్ 08(జనం సాక్షి)గుండెపోటుతో మహిళా వార్డు మెంబర్ మృతి చెందిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ పల్లి మండలం మాసానిగూడ గ్రామానికి అనుబంధ గ్రామమైన మంచర్లగూడ గ్రామానికి చెందిన పల్లె లతా నర్సింలు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎనిమిదో వార్డు నుంచి వార్డ్ మెంబర్ గా పోటీలో ఉన్నారు. కాగా ఆదివారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు బిడ్డలు ఒక కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ విషయమై ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను వివరణ కోరగా ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు.



