ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోతెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..

గంభీరావుపేట జూన్ 2 (జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల అధ్యక్షులు కోడె రమేశ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ గర్వం… తెలంగాణ ఆత్మగౌరవం దశాబ్దాల మరియు సకలజనుల పోరాట ఫలితంగా సాధించిన ఈ స్వరాష్ట్రం, వీరుల త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. ప్రతి తెలంగాణ బిడ్డ హృదయంలో నిలిచిన ఈ రోజు,మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గర్వదినం అభివృద్ధి, ఆత్మగౌరవం, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎత్తులకు ఎదగాలని ఆకాంక్షిస్తూ…తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ రాజు పత్తి స్వామి డాక్టర్ సత్యనారాయణ సర్వోత్తమ్ అంజన్ రావు దేవేందర్ యాదవ్ తిరుపతి నర్సింలు శ్రీనివాస్ చారి దేవా గౌడ్ మల్లేష్ గౌడ్ స్వామి నరేష్ నవీన్ శ్రీనివాస్ ఎల్లం చంద్రం యాదవ్ రాజేష్ నాయకులు పాల్గొన్నారు .