ఎందరో త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం

వరంగల్ ఈస్ట్, జూన్ 02 (జనం సాక్షి) ఎందరో త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్ర సాధన అని ఎం జె పి బి సి మహిళా డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ వి ఎన్ చారి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రంగశాయపేటలోని ములుగు, మహబూబాబాద్ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్.వి.ఎన్. చారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ఆకాంక్షల ఫలితమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు గ్రామీణ, పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రుషినంద్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కొల్లూరి యోగానంద్ మాట్లాడుతూ, విద్య ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందని, కళాశాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఆయన ఆలపించిన తెలంగాణ గీతం సభలోని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొని దేశభక్తి, ప్రాంతీయ అస్తిత్వ భావాలను రేకెత్తించింది.ఈ కార్యక్రమంలో కొలిపాక సందీప్, మైదం పవన్, శ్రీ మైదం జీవన్, సందీప్, రేశోజు రవీంద్ర చారి, అధ్యాపక బృందం, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.