మార్గదర్శకాలు లేకుండానే జీతాల్లో కోత అన్యాయం: డీ.టీ.ఎఫ్
తుంగతుర్తి జూన్ 1 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకుండానే హెల్త్ కార్డుల పేరుతో మే నెల వేతనంలో 1.5 శాతం కోత విధించడం అన్యాయమని డి టి ఎఫ్ తుంగతుర్తి మండల అధ్యక్ష కార్యదర్శులు కే నవీన్ ప్రసాద్, బి వెంకట మల్లు అన్నారు, సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికి ప్రభుత్వం 5డీఏ ల బకాయి12 శాతానికి పైగా ఉన్నది అన్నారు , ప్రభుత్వం కొత్త పిఆర్సి ఊసే ఎత్తడం లేదని ఇప్పుడు హెల్త్ కార్డుల పేరుతో వేతనాలలో కోత విధిస్తామని చెప్పడం సరైన నిర్ణయం కాదని అన్నారు, ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, హెల్త్ కార్డుల విషయంలో తక్షణమే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమైనటువంటి మార్గదర్శకాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు



