గంభీరావుపేట మండల నూతన ఎస్సైగా సిహెచ్ శ్రీకాంత్…

గంభీరావుపేట జూన్ 01(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నూతన ఎస్ఐగా భాధ్యతలు స్వీకరించిన సిహెచ్, శ్రీకాంత్ సోమవారం రోజు భాద్యతలు స్వీకరించారు. ఈయన సిరిసిల్లలో పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా గంభీరావుపేట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తానని, నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాల అరికడతామని, దానితో పాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈ వ్ టీజింగ్, పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఆపద సమయంలో డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసుల సహాయాన్ని పొందాలని ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్ఐ తెలిపారు.

తాజావార్తలు