కన్నతల్లితో సమానం ఇందిరమ్మ ఇల్లు

 

 

 

 

 బచ్చన్నపేట సర్పంచ్ అలువాల నర్సింగరావు

బచ్చన్నపేట జూన్ 3 ( జనం సాక్షి): పేదవారికి తన సొంతిల్లు కన్న తల్లితో సమానమని జీవన విధానంలో కూడు. గూడు. గుడ్డ చాలా ముఖ్యమని బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోడూరు మహాత్మాచారి తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు కచ్చితంగా ఇల్లు ఇస్తామని ఇంతకుముందు కూడా ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులతోపాటు నాయకులు నల్లగోని బాలకిషన్ గౌడ్. బొమ్మెర్ల వేణు వందన. అవధూత శ్రీనివాస్. దత్రపు నరేష్. ఎండి మసూద్. బొట్టు గణేష్. కర్రె మహేష్. వెంకట్ రెడ్డి. దేవరకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు