తెలంగాణలో మొత్తం పోలింగ్ ఎంత శాతం?

హైదరాబాద్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్‌ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్‌ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48శాతం నమోదైనట్లు ప్రకటించారు. నర్సాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 84.25శాతం, మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యల్పంగా 42.76శాతం నమోదైందని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 3శాతం పోలింగ్‌ పెరిగిందన్నారు. జూన్‌ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో 47.03శాతం, చేవెళ్లలో 56.40, కరీంనగర్‌లో 72.54, ఖమ్మంలో 76.09శాతం, మహబూబాబాద్‌లో 72.43శాతం, మల్కాజ్‌గిరిలో 50.78శాతం, మెదక్‌లో 75.09శాతం, నాగర్‌ కర్నూల్‌లో 69.46శాతం, నల్గొండలో 74.02శాతం, నిజామాబాద్‌లో 71.92శాతం, పెద్దపల్లిలో 67.87శాతం, సికింద్రాబాద్‌లో 49.04శాతం, వరంగల్‌లో 68.86శాతం, జహీరాబాద్‌లో 74.63శాతం పోలింగ్‌ నమోదైందని సీఈవో వికాస్‌ రాజ్‌ వివరించారు. ఇక కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 51.61శాతం పోలింగ్‌ నమోదైందని వెల్లడించారు.