మండి బిర్యానీ కథనాలపై కదిలిన ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం
షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా రెస్టారెంట్ హోటల్లో మండి బిర్యాని తిని ఆసుపత్రి పాలైన కుటుంబం అనే కథనాలను జనంసాక్షి పత్రిక వెలుగులోకి తెచ్చిన కేవలం 6 గంటల వ్యవధిలోనే రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం రంగంలోకి దిగింది రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఉదయ్ కిరణ్ బృందం సాయిబాబా హోటల్ ను తనిఖీ చేసి వంట సామగ్రి పరిశుభ్రంగా ఉందా లేదా అని తనిఖీలు నిర్వహించారు మరియు బిర్యానీ శాంపిల్స్ ను సేకరించి స్వాధీనం చేసుకున్నారు వంట గది పరిశుభ్రంగా లేకపోవడంతో కేసు నమోదు చేశారు కలుషిత ఆహారం తిని ఎనిమిది మందికి అస్వస్థత గురై శంషాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కథనాలను వెలుగులోకి తేవడంతో వెంటనే అధికారుల అధికార యంత్రాంగం స్పందించింది రంగంలోకి దిగిన అధికార బృందం సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ ను పూర్తిగా తనిఖీలు చేసి బిర్యాని నీ శ్యాంపీల్ తీసుకున్నారు కలుషిత ఆహారం పై విచారణ జరిపి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చరు ఇదే క్రమంలో అధికారులు ముందు బాధితులు తముపడ్డ ఇబ్బందులు ఆస్పత్రి పాలైన సమస్యలను చెప్పుకున్నారు
రోడ్లపై చిన్న పాటి టీ కొట్టులు నడిపించుకునేందుకు 100 రూపాయల రిజిస్ట్రేషన్ తో మూడు నాలుగు వేల రూపాయల వరకు కౌంటర్ చేసుకోవచ్చు అయితే ఈ హోటల్ యాజమాన్యం మాత్రం ప్రతిరోజు నిబంధనలకు విరుద్ధంగా అదే 100రూపాయల రిజిస్ట్రేషన్ తో సుమారు 30 వేల కౌంటర్ వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపారు అధికారులు..