అర్జీదారు వద్దకే భూమి రిజిష్టేషన్

రాయికల్ డిసెంబర్9( జనం సాక్షి):
రాయికల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగార్జున అర్జీదారు వద్దకే వచ్చి రిజిష్టేషన్ చేశారు పేరాలసిస్ తో ఉన్న కుమ్మరి పెళ్లి గ్రామానికి చెందిన అర్జీదారు కొడిమ్యల ఇందమ్మ తన భూమిని అమ్మకం చెయ్యగా అట్టి భూమీ కొనుగోలు రిజిష్టేషన్ నిమిత్తం కుటుంబం సభ్యులు ఆమెను తహసీల్దార్ కార్యాలయ ప్రాగణం వరకు ఆటోలో తీసుకురాగా అర్జీదారు నడవలేని స్థితిలో ఉందని తెలుసుకున్న తహసీల్దార్ నాగార్జున మానవత్వంతో స్పందించి కార్యాలయం బయట ఆటోలో ఉన్న ఆమె వద్దకు ప్రత్యేకంగా వచ్చిన వివరాలు తీసుకుని ఐరస్ మరియు ఈ కె వై సి సంతకాలు తీసుకుని రిజిష్టేషన్ ప్రక్రియ పూర్తి చేసి పత్రాలు అందజేశారు.



