31 వరకు అసెంబ్లీ
` 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి
` బీఏసీ సమావేశంలో సమావేశాల ఎజెండా ఖరారు
హైదరాబాద్(జనంసాక్షి): ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. బుధవారం పంటల రుణమాఫీపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే జాబ్క్యాలెండర్‌పైనా కూడా చర్చ జరుగనుంది. బీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు, బీఆర్‌ఎస్ నుంచి హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల హాజరయ్యారు. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల శాసనసభ ఇవాళ సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి సంతాపంగా సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.