చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

 

 

 

 

 

 

●చేర్యాల ఎస్సై గూడ అపూర్వ రెడ్డి

మహిళల రక్షణపై అంగన్వాడీలో అవగాహన సదస్సు

చేర్యాల (జనంసాక్షి) ఎప్రిల్ 28 : చట్టాల పట్ల ప్రజలు మహిళలు అవగాహన కలిగి ఉండాలని చట్టాలను అతిక్రమిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చేర్యాల ఎస్సై గూడ అపూర్వ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చుంచనకోట గ్రామ పాఠశాలలో అంగన్వాడీ టీచర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్సై ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కష్టపడి ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. మహిళల పట్ల ఎవరైనా మానసికంగా ఇతర ఇబ్బందులు పెట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.