వినోదం పేరిట జిఎస్టీకి ఎగనామం


తాజ్ మహల్ ఎగ్జిబిషన్ పేరుతో నల్లగొండ ప్రజల జేబుకు చిల్లు
భద్రత లేకుండా వేలాది మందితో ఆటలు
అన్ని అనుమతులు ఉన్నాయా?
నల్లగొండ ప్రతినిధి,జూన్ 03,(జనం సాక్షి):నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి తాజ్ మహల్ ఎగ్జిబిషన్ దందాసాగే తీరు ఈ ఎగ్జిబిషన్ అన్న విధంగా కొనసాగుతోంది. ఎంట్రీ ఫీజు మాత్రమే 80 రూపాయలు లోపటికి వెళ్ళాక మాత్రం ప్రతిదానికి సపరేటు రేటు ఉంటుంది. కనీసం తాగడానికి కూడా మౌలిక వసతులు కల్పనలో కూడా లేవు అలాగే అక్కడ ఏం కొనాలన్నా ఏం తినాలి అన్న వాళ్ళు పెట్టిన రేటే ఫిక్స్డ్ రేట్.ఒక్కో వినోదానికి ఒక్కో రేటు.మళ్ళీ జలకన్యాల పేరున నల్గొండ నగరానికి కొత్త ట్రైన్ ని అలవాటు చేస్తూ జలకన్యలు వేసుకున్న బట్టలు కూడా వివాదాన్ని గురి లేపేలా ఉన్నాయి. మొత్తానికి ప్రజల వినోదం పేరిట జేబులోకి చెల్లి పెడుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అక్కడికి వెళ్తే సుమారుగా ఒక కుటుంబానికి 1500 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ లావాదేవీ జరుగుతుందో తెలిసి పోతుంది. రోజు సుమారు లక్షల్లో వ్యాపార నడుస్తా ఉన్నాయి లోపు ఇది కాస్త కోట్ల రూపాయలకు టర్నవర్గా వెళ్తాఉంది మరి ఈ ప్రభుత్వానికి సమకూర్చాల్సిన పన్నులు ఏవి కూడా చోటు మంత్రంగా చెల్లిస్తూ నిర్వహణ కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి.
నల్లగొండ జిల్లా కేంద్రంలో నాగార్జున కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న తాజ్ మహల్ ఎగ్జిబిషన్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు రూ.80, మూడు సంవత్సరాల పైబడిన పిల్లలకు రూ.50 చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేస్తున్న నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రతిరోజూ వందలాది మంది సందర్శకులు వస్తుండగా, టికెట్లపై జీఎస్టీ వివరాలు స్పష్టంగా లేకపోవడం,అలాగే టికెట్టు ధర లేక పోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న మొత్తానికి సంబంధించి సరైన బిల్లులు ఇస్తున్నారా? ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.కానీ అధికారులు నిర్వాహకులు ఇచ్చిన తాయిలాలకి సప్పుడు చేస్తాలేరు అనే ఆరోపణలు ఉన్నాయి.
భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేసారా?:
ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్స్, పిల్లల ఆట పరికరాలు, విద్యుత్ అలంకరణలు, తాత్కాలిక స్టాల్స్ వద్ద తగిన భద్రతా చర్యలు కనిపించడం లేదని సందర్శకులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం లేదా ఇతర ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర సహాయక చర్యలకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా అనే సందేహాలు నెలకొన్నాయి.అక్కడ ఫైర్ సేఫ్టీ లేదు అని భద్రత ప్రమాణాలు లేవు అని తెలుస్తోంది.
అనుమతులు ఉన్నాయా లేవా?:
ఇలాంటి భారీ ఎగ్జిబిషన్లకు మున్సిపాలిటీ, ఫైర్ శాఖ, పోలీసు శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ తదితర విభాగాల అనుమతులు తప్పనిసరి. నిర్వాహకులు అన్ని అనుమతులు పొందారా? భద్రతా తనిఖీలు జరిగాయా? అనే విషయాలు ప్రజలకు తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది:
ఎగ్జిబిషన్‌లో రోజూ చిన్నారులు, మహిళలు,యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా ఘటన జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? సందర్శకులకు బీమా సదుపాయం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అలాంటివి ఏమి లేవు అని తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ప్రజల ప్రాణాలకు ఎలాంటి హామీలేనట్లు అక్కడ స్పష్టం అవుతోంది మరి ప్రాణాలతో చెలగాటం ఆడే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి
అధికారుల మౌనం వెనుక దాగున్న రహస్యం ఏంటి:
ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్‌పై సంబంధిత శాఖలు ఇప్పటివరకు సమగ్ర తనిఖీలు నిర్వహించాయా లేక చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.అధికారులకు అటు ఎగ్జిబిషన్ అనయులకు కొన్ని ఫ్రీగా పాసులు కూడా పంపిణీ చేసినట్టు సమాచారం.
ఎగ్జిబిషన్ పై వ్యక్తమవుతున్న అనుమానాలు
టికెట్‌పై జీఎస్టీ వివరాలు ఎక్కడ?,జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా?, ఫైర్ సేఫ్టీ అనుమతి తీసుకున్నారా? పోలీసు, మున్సిపల్ అనుమతులు ఉన్నాయా?ఆట పరికరాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా?,అత్యవసర పరిస్థితులకు అంబులెన్స్, ఫస్ట్ ఎయిడ్ సదుపాయం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.విద్యుత్ కూడా చౌర్యం అవుతుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జిఎస్టీ అధికారులు మౌనం ఎందుకు:
ఒక్కో టికెట్ ధర పెద్దలకు 80 రూపాయలు మూడు సంవత్సరాల పైన పడిన చిన్నారులకు 50 రూపాయల చొప్పున కౌంటర్ ఏర్పాటు చేసి టికెట్లు అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు సుమారు ఆ ఎగ్జిబిషన్ కోసం తిలకించడానికి నల్గొండ జిల్లా కేంద్రం నుంచి వందలాది మంది అక్కడ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు కానీ ఆ టికెట్పై ఎలాంటి జీఎస్టీ గాని అ టికెట్ దొరగాని వివరాలు ఏమీ ఉండవు మరింత జరుగుతున్న నల్గొండ జిల్లా కేంద్రంలో జిఎస్టి అధికారులు నిద్ర భక్తులో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి లేదా ఆ ఎగ్జిబిషన్ వారితో కుమ్మక్కు అయ్యారా అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి మరి ఇకనైనా కళ్ళు తెరిచి వినదు పన్ను వసూలు విషయంలో జాగ్రత్త వహించి ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎగనామం పెట్టే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు పై వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వానికి ఆదాయ వనరులు కొట్టేస్తున్న వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.



