ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

కొల్చారం తహసిల్దార్ శ్రీనివాస్ చారి

కొల్చారం, మార్చి 9 (జనం సాక్షి ):కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి చౌరస్తా టీ జంక్షన్ సమీపంలో సర్వేనెంబర్ 251 లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా జరుపుతున్న అక్రమ నిర్మాణాలను పై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాలని వ్యాపార వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే సంబంధిత భూముల పట్టాలను రద్దుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు వెంటనే సర్వే నంబర్ 251 లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు.