నిరుపేద కుటుంబానికి దుద్దుకూరి సుమంత్ ఫ్రెండ్స్ సర్కిల్ చేయూత

ఖమ్మం, (జనంసాక్షి) : జూలూరుపాడు మండలం, గుండెపుడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామం రాంచంద్రపురంలో నివసిస్తున్న బొజ్జగాని ముత్తమ్మ గారు ఏప్రిల్ 11న మరణించారు. ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కర్మకాండల నిర్వహణకు దుద్దుకూరి సుమంత్ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ముక్తి రాజులు, ముక్తి రమేష్, పూనెం సత్యవతి, ముక్తి లక్ష్మి, పూనెం నవీన్, మల్కం రాములు, ఈసం శివాజీ, తాటి రాము, నర్సింహారావు తదితరులు, అలాగే ముత్తమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.