సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి):నూతనంగా ఎన్నిక కాబోయే సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల సమావేశంను నిర్వహించారు.జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి ఎన్నికలపై కమిటీ సభ్యులు అనేక తీర్మానాలు తీసుకోవడం జరిగింది.క్లబ్ కమిటీ నిర్వహణ విధి విధానాలు త్వరలోనే వెల్లడించనున్నారు.ఈ సమావేశంలో క్లబ్ నిర్వహణ కమిటీ సభ్యులు తోట నర్సయ్య,బొజ్జ ఎడ్వర్డ్,బుక్క రాంబాబు,గుణగంటి సురేష్ గౌడ్ , ఊటుకూరి రవీందర్ పాల్గొన్నారు.



