ఘనంగా బడిబాట కార్యక్రమం ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి ఈ ఓ

మెదక్ ఏప్రిల్ 18 (జనం సాక్షి)మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం కూచంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి కూ చన్ పల్లి గ్రామపంచాయతీ వరకు భారీ ర్యాలీగా ప్రైవేటు స్కూలు వద్దు గవర్నమెంట్ స్కూలు ముద్దు అంటూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి విజయ ఎం ఈ ఓ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుమోహన్ పాల్గొన్నారు డి ఈ ఓ విజయ మాట్లాడుతూ పిఎం శ్రీ ఎంపికైనందుకు చాలా గర్వపడుతున్నానని ఈ స్కూల్లో 450 స్ట్రెంత్ ఉండగా దీన్ని గ్రామ ప్రజలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు 600 పైగా స్టెన్త్ పెంచాలని మంచి ఉపాధ్యాయుల బృందం ఈ స్కూల్లో ఉన్నదని ప్రైవేటు స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూలు ఉన్నాయని ప్రైవేట్ స్కూళ్లకు పంపకుండా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలనికోరారు ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయని దీని అందరూ సద్వియోగం చేసుకోవాలని వారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఉన్నత స్థానాలకు ఎదిగారని ఇప్పుడు కూడా స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారుగ్రామ ప్రజలను మరియు చుట్టుపక్క గ్రామాల ప్రజలను ప్రైవేట్ స్కూల్లో చేర్పించకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని ఆమె కోరారు అనంతరం స్కూల్ యొక్క కరపత్రాన్ని ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో సీఎం ఏవో రాజు మాజీ సర్పంచ్ జండా కాడి దేవా గౌడ్ లింగాల సంతోష్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొజ్జాపురం యేసయ్య ఉపాధ్యాయుల బృందం గ్రామ ప్రజలు విద్యార్థులు తదితరులుభారీ ఎత్తున పాల్గొన్నారు