అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.

share on facebook

యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా.
తాండూరు అగస్టు 12(జనంసాక్షి)అన్నా చెల్లి ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని
యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా పేర్కొన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన రక్షాబంధన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ. అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక ఈ రక్షా బందన్ అన్నారు.భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మండల కేంద్రంలో రక్షాబంధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మంచి అనుబంధాన్ని ఆప్యాయతను పర్వదినాన్ని ఆనందంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.ఈ పండుగను అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. రక్షాబంధన ఉత్సవాల్లో మండల పరిధిలో మహిళలు ఆనందోత్సాహాల మధ్య రాఖీ కడుతూ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అక్కతమ్ముళ్ల , అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని.. సోదరుడు సోదీరిమణుల అనురాగానికి సంకేతమైన ఈ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. మండల అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రాణాలిక రూపొందించుకొని ముందుకు వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ అధ్యక్షుడు అక్బర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.