ఉపాధి పథకం పనుల నిర్ధారణ

share on facebook

వందరోజుల పని లక్ష్యంగా కార్యాచరణ

సూర్యాపేట,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఉపాధి హావిూపథకంలో గ్రామాల్లో అవసరమైన పనులు చేసేలా కార్యాచరణ రూపొదించారు. అలాగే పంచాయితీ భవనాల నిర్మాణం చేపడతామని ఇప్పటికే మంత్రిఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రకటించారు. ఈ పథకం ద్వారా హరితహారంలో మొక్కలు నాటడం వాటిని సంరక్షణతో పాటు చెరువుల్లో పూడిక తీయడం, కాల్వల్లో పేరుకు పోయిన పూడిక, చెత్తను తొలగించడం, వ్యవసాయ భూముల వద్దకు బాటలు నిర్మించడం, ఇంకుడు గుంతలు, కందకాలు తీయడం, బావుల తవ్వకం, రోడ్ల నిర్మాణాలు, శ్మశాన వాటికలు, కిచన్‌ షెడ్స్‌ల నిర్మాణం తదితర పనులు చేయడం జరుగుతుంది. మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద భవనాలు, కంపౌడ్‌ వాల్స్‌, సీసీరోడ్లు నిర్మాణం వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ పనులను ఆయా గ్రామాల్లో గుర్తించి కూలీలతో చేయిస్తారు. జాతీయ ఉపాధి హావిూ పథకం ప్రతి ఒక కూలికి వందరోజుల పని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చట్టం చేయడం జరిగింది. గ్రామాలల్లో ఉండే కూలీలకు ఉపాధి కల్పించడం.. కరువు సంభవించనప్పుడు గ్రామాలను వదిలి వలసలు వెళ్లకుండా పనులు కల్పించే ఉద్దేశంతో ఈపథకం రూపకల్పన చేయడం జరిగింది. ఉపాధి హావిూలో జాబ్‌కార్డులు పొందిన కుటుంబానికి సంవత్సరంలో 100 రోజులు తప్పని సరిగా పని కల్పించాల్సి ఉంది. పనిని బట్టి ఈ పథకంలో అత్యధికంగా ఒక వ్యక్తికి రోజుకు రూ.17 కూలీ అందించాల్సి ఉంటుంది.ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలోని 475 గ్రామ పంచాయతీలలో 2,45,405 కుటుంబాలకు గాను 5,69,37 మందికి ఉపాధి హావిూలో జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఉపాధి హామిలో సూర్యాపేట జిల్లా రాష్ట్రవ్యాప్తంగా మంచిస్థానంలో నిలుస్తూ వస్తుంది. ఎంతమంది కూలీలు అవసరం అనే అంశాలతో గ్రామాల వారీగా ఉపాధి ప్రణాళికలను తయారు చేయడం జరిగింది. గ్రామసభల అనంతరం మొత్తం సమాచారాన్ని మండలాల వారీగా జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖకు పంపించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లావ్యాప్తంగా 55,79,41 పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. గత ప్రణాళికతో పోల్చితే సుమారు 6.5 లక్షల పనిదినాలు తగ్గడం జరిగింది. జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ తయారు చేసిన ప్రణాళికను కలెక్టర్‌ ఆమోదించాల్సి ఉంది. ఆ సమయంలో కలెక్టర్‌ ఉపాధి పనిదినాలు పెంచే అవకాశం లేదా యాధాతథంగా ఆమోదించే అధికారం సైతం ఉన్నది. ఉపాధి హావిూలో గుర్తించిన పనిలో 60శాతానికి తగ్గకుండా లేబర్‌ కంపొనెంట్‌, 40శాతం మించకుండా మెటీరియల్‌ కంపోనెంట్‌ ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. సుమారు రూ.4.37 కోట్లు ఉపాధి హావిూలో ఖర్చు చేయడం జరిగింది. ఈఏడాది సగటున ఒక కూలీకి 110.29 పైసలు పడగా 2241 కుటుంబాలకు వందరోజుల పాటు పనికల్పించారు.

Other News

Comments are closed.