కార్యకర్తలకు అండగా బీఆర్‌ఎస్‌

share on facebook

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని సూర్యాపేట మున్సిపాలిటీ 17వ వార్డ్ కౌన్సిలర్ చింతలపాటి భరత్ అన్నారు.17వ వార్డు చింతలచెరువుకు చెందిన ఏర్పుల మల్లిఖార్జున్ ఇటీవల మృతి చెందారు.ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వంను కలిగి ఉండటంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చొరవతో తెలంగాణ భవన్ లో సోమా భరత్ కుమార్, మారెళ్ళ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కౌన్సిలర్ చింతలపాటి భరత్ సమక్షంలో ఇన్సూరెన్స్ సాంక్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీని మల్లిఖార్జున్ సతీమణి లక్ష్మీకి
అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకుని కార్యకర్తకి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, వారి కుటుంబానికి అండగా,భరోసాగా నిలవడం కోసమే కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ ఆలోచించి 60 లక్షలకు పై గల కార్యకర్తల కుటుంబానికి సంవత్సరానికి రూ.28 కోట్లు ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.

Other News

Comments are closed.