కెసిఆర్‌ హావిూతో ప్రజలకు భరోసా

share on facebook

కాళేశ్వరం నీటితో మారనున్న దశ: ఎమ్మెల్యే
సిద్దిపేట,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ పర్యటనతో రైతులు, ప్రజల్లో భరోసా పెరిగిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఇప్పుడు ప్రజల అభివృద్దే ముఖ్యమని కెసిఆర్‌ నిరూపించారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని, గోదావరిలో వృథాగా వెళ్లే జలాలను బీడు భూ ములకు మళ్లించాలనే సంకల్పం గొప్పదన్నారు. కాళేశ్వరం నుంచి గంగ పారుతున్న దృశ్యాలు  ఇక్కడి రైతాంగానికి తీపి కబురని అన్నారు. ఈ ప్రాజెక్టు భావితరాలకు మేలు చేయడమే గాకుండా అన్నదాతలకు ఇక నీటి భరోసా ఇస్తుందని  పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలో టీం వర్క్‌ చేశారని పేర్కొంది. ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారానికి కృషి చేయడాన్నిఅభినందించారు.రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని  ఎమ్మెల్యే  అన్నారు.  రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎవసం దండగంటూ కరెంటు కష్టాలు తెచ్చిన చంద్రబాబుకు, లోవోల్టేజీ విద్యును అందించి కరెంటు కస్టాలు తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు కనుమరుగు చేశారన్నారు. నేడు గజ్వెల్‌ నియోజకవర్గం మరో కోనసీమగా మారి విపరీతంగా ధాన్యం ఉత్పత్తి అయ్యిందన్నారు.

Other News

Comments are closed.