పినపాక నియోజకవర్గం మార్చి 6 (జనం సాక్షి): మణుగూరు మండలం సాంబాయిగూడెం కు చెందిన. ఆంగ్ల ఉపాద్యాయుడు షేక్ మీరాహుస్సేన్ కు ఖమ్మంజిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2020 ,ది బెస్ట్ లీడర్ అవార్డు ,బహుజన సాహిత్య అకాడమీ వారు అందించే జాతీయ అవార్డ్స్ లో భాగంగా డా.ఏ .పీ .జె .అబ్దుల్ కలాం జాతీయ అవార్డు కు ఎంపికయ్యారు . హైద్రాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయం లో (బి.ఎస్ ఏ ) ఆదివారం బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు ఎంపిక పత్రాలను అందుకున్నారు .వృత్తి లో భాగంగా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ,కో కరిక్యూలర్ ఆక్టివిటీస్ లో విద్యార్థులను చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం , ప్రవృత్తి లో సామాజిక భాద్యత, పర్యావరణ పరిరక్షణ లో భాగంగా హరితాహారం లో మొక్కలను నాటడం ,సామాజిక చైతన్య ,సేవా కార్యక్రమాల నిర్వాహణ ,రక్త దానం ,మాస్కుల పంపిణి ,పారిశుధ్య కార్మికులకు సన్మానం వంటి కార్యక్రమాలకు గాను ఈ అవార్డును ప్రధానం చేస్తారు. మార్చి 13న తిరుపతి లో జరిగే సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 5వ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ సందర్భంగా సహోద్యోగులు ,గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు అభినందించారు.
Other News
- *రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*
- పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు ...సారు
- కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి... * వర్ధంతి సభలో జూలకంటి..
- మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్.....
- *జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు *
- .....బెస్ట్ పర్ఫామెన్స్ ఎంపీడీవో గా లెంకల గీతారెడ్డి.......
- " అన్ని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకి 50 శాతం రాయితీ ఇవ్వాలి - టీయూడబ్ల్యూజే హెచ్ రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టికరణ"
- " అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్టు అక్రిడేషన్ అందుతుంది - టీయూడబ్ల్యూజేహెచ్ - 143"