ఇరాన్‌లో ఆందోళనలు హింసాత్మకం
` తీవ్రరూపం దాల్చిన ప్రజాగ్రహం
` నిరసనల్లో ఇప్పటివరకు వంద మందికిపైగా మృతి
` అల్లరి మూకలు మొత్తం సమాజాన్నే నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి
` నిరసనకారుల వాదనలు వినేందుకు సిద్ధంగా ఉన్నాం
` దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు
` మా దేశంపై అమెరికా దాడిచేస్తే ఆ దేశంతోపాటు ఇజ్రాయెల్‌కు మా లక్ష్యాలుగా మారతాయి: ఇరాన్
టెహ్రాన్(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌లో ప్రజాగ్రహం తీవ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు వంద మందికిపైగా మృతి చెందారు. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లరి మూకలు మొత్తం సమాజాన్నే నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నిరసనకారుల వాదనలు వినేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.‘‘ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం వాస్తవమే. మేం వారితో మాట్లాడాలి. వారి సమస్యలను పరిష్కరించడం మా కర్తవ్యం. కానీ, అంతకంటే ముఖ్యమైన పని ఏంటంటే.. అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయకుండా చూడటమే’’ అని అధికారిక విూడియా ఇంటర్వ్యూలో పెజెష్కియాన్ తెలిపారు. అంతకుముందు పార్లమెంటు స్పీకర్ ఖలీబఫ్ మాట్లాడుతూ.. ఆందోళనకారులతో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. అరెస్టయిన వారిని శిక్షిస్తామన్నారు. ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడం, జీవన వ్యయాలు పెరగడం వంటి సమస్యలతో రెండు వారాలుగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. మరోవైపు.. ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోందని, వారికి సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ పోస్టు చేశారు. దీన్ని ఇరాన్ ఖండిరచింది. ఒకవేళ తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతోపాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది.
మా దేశంపై అమెరికా దాడిచేస్తే ఆ దేశంతోపాటు ఇజ్రాయెల్‌కు మా లక్ష్యాలుగా మారతాయి: ఇరాన్
ఇరాన్ లో కొన్ని రోజులుగా జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది.ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడం, జీవన వ్యయాలు పెరగడం వంటి సమస్యలతో డిసెంబర్ 28 నుంచి ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ట్రంప్.. ‘‘ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది. వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది’’ అని నిరసనకారులకు మద్దతుగా పోస్టు పెట్టి కలకలం రేపారు. తాజా పరిణామాల వేళ ఇరాన్ పార్లమెంట్ సమావేశమైంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చట్టసభ సభ్యులు చర్చించారు. ఈ క్రమంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్.. అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు చేశారు. సభలో పలువురు సభ్యులు అమెరికాకు వ్యతిరేకంగా, తమ సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు.మరోవైపు ట్రంప్ పోస్టు నేపథ్యంలో.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్ మిలిటెంట్లు 2023లో ఈ దేశంపై దాడులకు తెగబడ్డారు. అలాగే మరో గ్రూప్ హెజ్‌బొల్లాతోనూ పోరాడిన సంగతి తెలిసిందే.
ట్రంప్ హింట్‌తో ఇజ్రాయెల్ హైఅలర్ట్..
ఇరాన్‌లో కొన్ని రోజులుగా జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో వ్యహరిస్తోంది.ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడం, జీవన వ్యయాలు పెరగడం వంటి సమస్యలతో డిసెంబర్ 28 నుంచి ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ట్రంప్.. ‘‘ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది. వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది’’ అని నిరసనకారులకు మద్దతుగా పోస్టు పెట్టి కలకలం రేపారు. తాజా పరిణామాల వేళ ఇరాన్ పార్లమెంట్ సమావేశమైంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చట్టసభ సభ్యులు చర్చించారు. ఈ క్రమంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్.. అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు చేశారు. సభలో పలువురు సభ్యులు అమెరికాకు వ్యతిరేకంగా, తమ సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు.మరోవైపు ట్రంప్ పోస్టు నేపథ్యంలో.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్ మిలిటెంట్లు 2023లో ఈ దేశంపై దాడులకు తెగబడ్డారు. అలాగే మరో గ్రూప్ హెజ్‌బొల్లాతోనూ పోరాడిన సంగతి తెలిసిందే.


