దొంగల ముఠా అరెస్ట్ రిమాండ్ తరలింపు

గంభీరావుపేట జనవరి 12(జనం సాక్షి):. సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాల్లో దొంగతనాలు చేస్తూ జల్సా లకు అలవాటు పడిన ఏ 1 సంగేమ్ జంపయ్య తండ్రి వాడపల్లి వయస్సు 27 ముదిరాజ్ ఏ 2 పూజారి శంకర్ తండ్రి సత్యనారాయణ వయస్సు 35 , ముదిరాజ్ ఏ 3కండెల్లి జయప్రకాష్ తండ్రి రవి వయస్సు 19 ( మాదిగ) ఏ 4 గోలు శంకర్ వయస్సు 38 అంబేద్కర్ నగర్,రైల్ నిలయం సికింద్రాబాద్ వారు గంభీరావుపేట పేట మండలంలో కోలమద్ది గ్రామంలో మోటార్ దొంగతనం, మల్లారెడ్డిపేటలో గొర్రెల దొంగతనం మరియు జగదాంబ తండాలో గ్రామపంచాయతీ మోటర్ దొంగతనం మరియు ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో వైరు దొంగతనం చేసి అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసి తిరిగి సముద్రలింగాపూర్ లో దొంగతనం చేసే ప్రయత్నంలో పెట్రోలింగ్ చేసే పోలీసులకు దొరికినారు. ఇట్టి వీరి నలుగురి పై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని పి.అనిల్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గంభీరావుపేట తెలిపారు


