జిల్లాల పునర్విభజనకు విశ్రాంత న్యాయమూర్తితో కమిషన్‌

` అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం: సీఎం రేవంత్‌
` వాటిని సరిదిద్ది పాలనాపరమైన ఇబ్బందులు తొలగిస్తాం
` టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను రేషనలైజ్‌ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలనలో సమస్యలు సృష్టించిన ఈ జిల్లాల ఏర్పాటును సవిూక్షించి సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్రంలోని పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతం చేయడానికి అవసరమన్నారు.గత ప్రభుత్వం అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, త్వరలో జిల్లాల పునర్విభజన కోసం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్‌ పేరు సహేతుకంగా లేదనే మార్చినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం వెల్లడిరచారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్‌ వస్తోందని.. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి త్వరలో రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కమిషన్‌ ఆరు నెలలపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్‌ పై నివేదిక సమర్పిస్తుందని సీఎం చెప్పారు. అన్ని జిల్లాల్లో మండలాలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, బ్జడెట్‌ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, విధివిధానాలు రూపొందిస్తామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కమిషన్‌ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ సారథులుగా సీఎం రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు. ’మా ప్రభుత్వ వారదులు.. సారథులు ప్రభుత్వ ఉద్యోగులే. ఆనాడు ప్రభుత్వం తప్పుడు పనులను ఉద్యోగులపై ఒత్తిడి చేసి అమలు చేయించింది. పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఫామ్‌ హౌజ్‌లో పడుకున్నారు’ అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ’నేను అన్నగా వచ్చాను. ఇప్పుడు నేను 18 గంటలు పనిచేస్తున్నాను. ఈరోజు డీఏ ్గªల్‌ విూద సంతకం చేసి వచ్చాను. దీంతో ప్రభుత్వానికి రూ.227కోట్ల భారం పడుతుంది’ అని రేవంత్‌ రెడ్డి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు.ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రతీ ఉద్యోగికి రూ.1.02 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తాం. ఉద్యోగులు, ప్రభుత్వం వేరువేరు కాదు. ఇద్దరం కలిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి’ అని సీఎం అన్నారు. అలాగే, భూములు, ఇసుక, ఉªు సబ్సిడీలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని నిరోధిస్తే ప్రభుత్వ ఆదాయం మెరుగవుతుందని సీఎం రేవంత్‌ చెప్పుకొచ్చారు. తాను ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తీసుకుందామని అనుకున్నా.. ఏదో ఒక పని వచ్చి పడుతోందన్నారు. ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్టాన్న్రి నడపలేరని, 10.50లక్షల ప్రభుత్వ ఉద్యోగులే రాష్టాన్న్రి నడిపిస్తున్నారని అన్నారు. ఉద్యోగులే ప్రభుత్వ సారథులు, వారధులు. వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం. ఉద్యోగుల్లో కూడా నేను అంటే నచ్చని వారు చాలా మంది ఉండొచ్చు. నేను వచ్చాక ఉద్యోగుల జీతాలు ఎలా వస్తున్నాయో విూరే గమనించాలి. ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసి ఇక్కడికి వచ్చాను. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.కోటి బీమా ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.12వేల కోట్లు మేర పెండిరగ్‌లో ఉన్నాయి. పన్ను వసూళ్లలో అవకతవకలు అరికడితే రావాల్సిన నిధులు వస్తాయి. పన్నులు పెంచాల్సిన అవసరం లేదు. సరిగా వసూళ్లు చేస్తే చాలు‘అని అన్నారు.

 

4.తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశారో జాగ్రత్త !
` 15 శాతం జీతం కోత విధిస్తాం
` దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం
` ప్రణామ్‌ కార్యక్రమంతో వృద్ధులను ఆదుకోవాలనే నిర్ణయం
` ’బాల భరోసా’ పథకం, ’ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్ల ప్రారంభంలో సిఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ’బాల భరోసా’ పథకం, ’ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులకు సహాయ ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు రూ. 50 కోట్లతో పరికరాలను అందించామని రేవంత్‌ తెలిపారు. ప్రభుత్వం విూ కోసం ఉందని చెప్పడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడిరచారు.ప్రణామ్‌ కార్యక్రమంతో వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తాం. ఈ బ్జడెట్‌ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తున్నాం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిని మనమే దారిలోకి తీసుకురావాలి. కన్నవారి పట్ల బాధ్యత లేనివారికి సమాజంపై ఏం బాధ్యత ఉంటుందని రేవంత్‌ అన్నారు. దివ్యాంగులు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. వారిని ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తాం. క్రీడల్లో రాణించినవారికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించు కుంటూ ఎదగాలి. ఈ ప్రాంతంలో ప్రత్యేక ప్రతిభావంతులకు జైపాల్‌ రెడ్డి స్ఫూర్తి. మా ప్రభుత్వంలో ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. కోఆప్షన్‌ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్‌ను కార్పొరేటర్‌గా నామినేట్‌ చేయాలని మంత్రులను కోరుతున్నా. అలాగే మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యులుగా నామినేట్‌ చేయాలి. ట్రాన్స్‌జెండర్‌ సమస్యలను వాళ్లే చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్యం అందించాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ సమాజం స్వేచ్ఛను, సామాజిక న్యాయం, సమాన అవకాశాన్ని కోరుకుంటుంది దాదాపు వందేళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన జరిగింది. కులాల జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలి. మా ఒత్తిడితోనే కేంద్రం కుల గణన చేస్తోందని సీఎం రేవంత్‌ వెల్లడిరచారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, రాజనర్సింహ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

నాణ్యత విషయంలో రాజీపడొద్దు
` ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే కిట్‌పై అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్‌ కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్‌ ప్రొక్యూర్మెంట్‌ పై ఉన్నతాధికారులతో సీఎం సవిూక్ష నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్‌ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. యూనిఫామ్‌ తో పాటు 21 వస్తువులతో కూడిన కిట్‌ ను విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. స్కూల్‌ బెల్ట్‌, టై, షూస్‌, స్కూల్‌ బ్యాగ్‌, నోట్‌ బుక్స్‌, ఇతర వస్తువులను అందించేందుకు అవసరమైన ప్రొక్యూర్మెంట్‌ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లకు సంబంధించిన పెండిరగ్‌ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సవిూక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌ రెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ సబ్యసాచి ఘోష్‌, సిఎం సెక్రటరీ వేముల శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.